శోధన

    వెబ్‌సైట్ భాషను ఎంచుకోండి

    జీడీపీఆర్ అనుగుణ్యత

    మా వెబ్‌సైట్‌లో మీకు ఉత్తమ అనుభవం అందించడానికి మేము కుకీలను ఉపయోగిస్తాము. మా సైట్‌ను కొనసాగించడం ద్వారా మీరు మా కుకీల వినియోగాన్ని అంగీకరిస్తున్నారు, గోప్యతా విధానం, మరియు సేవా నిబంధనలు.

    kntvtelugu
    kntvtelugu

    Brahma Kumaris : ప్రపంచ శాంతే బ్రహ్మకుమారీల ఆశయం – బీకే శివాని దీదీ

    2 days ago

    కాకినాడ, తొలి ఉదయం:
    ప్రపంచ శాంతి స్థాపనే బ్రహ్మకుమారీల ప్రధాన ఆశయమని, ప్రతి ఆత్మ తన అసలైన పవిత్ర స్వరూపాన్ని గుర్తించి జీవించడమే జీవిత లక్ష్యమని ఇంటర్నేషనల్ మోటివేషన్ స్పీకర్ బీకే శివాని దీదీ స్పష్టం చేశారు. భగవంతుడు నిరాకారుడు, జ్యోతిర్బిందు స్వరూపుడనే సిద్ధాంతాన్ని అనుసరించి రాజయోగ ధ్యానం ద్వారా ఆత్మశక్తిని పెంపొందించుకోవాలని ఆమె సూచించారు.  స్థానిక సర్పవరం ఇండస్ట్రీయల్ ఏరియాలోని డిజిబి కల్యాణ మండపంలో ఆదివారం ఉదయం నిర్వహించిన బ్రహ్మకుమారీల ఆత్మీయ సమావేశం భక్తి, ఆధ్యాత్మికతతో కళకళలాడింది. ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం గోదావరి జోన్ ఇన్‌చార్జ్ రజని దీదీ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి సుమారు వెయ్యి మంది హాజరయ్యారు.

     

    ఈ సందర్భంగా బీకే శివాని దీదీ మాట్లాడుతూ, మన జీవితంలో ఎదురయ్యే ప్రతి నెగటివ్ పరిస్థితిని పాజిటివ్‌గా మార్చుకునే శక్తి మనలోనే ఉందని తెలిపారు. చుట్టూ ఎలాంటి వ్యక్తులు ఉన్నా, అందరిపట్ల శుభ భావనలు, మంచి ఆలోచనలు ఉంచుకోవాలని సూచించారు. ఇతరుల్లో కనిపించే లోపాలను మన లోపాలుగానే భావిస్తే సహజంగానే దయ, కరుణ పెరుగుతాయని చెప్పారు.

     

    ఎవరి పట్లైనా చెడు భావాలు పెట్టుకోకుండా ప్రేమతో మమేకమవ్వడమే నిజమైన ఆధ్యాత్మిక సాధన అని పేర్కొన్నారు. దేవతల నాటకాలలో పాత్రధారణ చేసినవారిని కొద్ది క్షణాలైనా దేవతలుగా భావించినట్లే, మన రోజువారీ కర్మలను “నేను దేవతను” అనే భావంతో చేస్తే మనలోని దేవతా స్థితి వెలుగులోకి వస్తుందని వివరించారు. భగవంతుడిని తోడుగా చేసుకుని జీవిస్తే ఆపదల సమయంలో కూడా ఆయన సూచనలు మనకు అర్థమవుతాయని, భగవంతుని రక్షణ తప్పకుండా లభిస్తుందని ఆమె పేర్కొన్నారు. ఆలోచనలు, మాటలు, కర్మలు పవిత్రంగా ఉంటే వ్యక్తిగత జీవితంతో పాటు సమాజంలో కూడా సానుకూల మార్పు వస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గోదావరి జిల్లాల నుంచి వచ్చిన బ్రహ్మకుమారీలు, సాధకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. శివాని దీదీ సందేశాత్మక ప్రసంగం హాజరైన వారిని ఆధ్యాత్మికంగా ఉత్తేజపరిచిందని పలువురు అభిప్రాయపడ్డారు.

    ఇక్కడ క్లిక్ చేయండి ఇంకా చదవండి
    మునుపటి ఆర్టికల్
    SL vs IRE Live Score: Sri Lanka begin cautiously against Ireland
    తర్వాత ఆర్టికల్
    5 tips to increase hair density naturally

    సంబంధిత ఆంధ్రప్రదేశ్ అప్‌డేట్స్:

    మీరు ఖచ్చితంగా తొలగించాలనుకుంటున్నారా? ఈ కామెంట్ తొలగించబోతున్నారు..! తొలగించు రద్దు చేయి

    కామెంట్స్ (0)

      కామెంట్ రాయండి