శోధన

    వెబ్‌సైట్ భాషను ఎంచుకోండి

    జీడీపీఆర్ అనుగుణ్యత

    మా వెబ్‌సైట్‌లో మీకు ఉత్తమ అనుభవం అందించడానికి మేము కుకీలను ఉపయోగిస్తాము. మా సైట్‌ను కొనసాగించడం ద్వారా మీరు మా కుకీల వినియోగాన్ని అంగీకరిస్తున్నారు, గోప్యతా విధానం, మరియు సేవా నిబంధనలు.

    kntvtelugu
    kntvtelugu

    Bomb Threat Evacuates Nampally CBI Court : నాంపల్లి సీబీఐ కోర్టుకు మళ్లీ బాంబు బెదిరింపు.. అలర్ట్‌లో పోలీసులు

    14 hours ago

    హైదరాబాద్‌లోని CBI Court Nampallyకు మరోసారి బాంబు బెదిరింపు రావడం కలకలం రేపింది. శుక్రవారం కోర్టు సిబ్బందికి ఈ–మెయిల్ ద్వారా బెదిరింపు సందేశం అందింది. కోర్టు ప్రాంగణంలో బాంబు అమర్చామని, టైమ్ సెట్ చేశామని, అది పేలబోతుందని దుండగులు హెచ్చరించారు.

    ఆగమేఘాల మీద ఖాళీ చేసిన ప్రాంగణం

    సందేశం అందిన వెంటనే కోర్టు సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, క్విక్ రెస్పాన్స్ టీమ్‌లు కోర్టు వద్దకు చేరుకున్నాయి. న్యాయవాదులు, కక్షిదారులను తక్షణమే బయటకు పంపించి, ప్రాంగణాన్ని పూర్తిగా ఖాళీ చేశారు. అనంతరం బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ బృందాలు విస్తృత తనిఖీలు చేపట్టాయి.

    ఇటీవలే పలు కోర్టులకు బెదిరింపులు

    గత ఫిబ్రవరి 18న తెలుగు రాష్ట్రాల్లోని పలు కోర్టులకు కూడా ఇలాంటి బెదిరింపులు వచ్చిన విషయం తెలిసిందే. హైదరాబాద్‌లోని నాంపల్లి కోర్టుతో పాటు కరీంనగర్, Rajamahendravaram, Anantapur కోర్టులకు కూడా బాంబు బెదిరింపులు అందాయి. అయితే ఆ సందర్భంలో నిర్వహించిన తనిఖీల్లో ఎక్కడా ఎటువంటి పేలుడు పదార్థాలు లభించలేదు. వాటిని నకిలీ బెదిరింపులుగా పోలీసులు నిర్ధారించారు.

    కేసు నమోదు – దర్యాప్తు ముమ్మరం

    ఈ మెయిల్స్, ఫోన్ కాల్స్‌పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. బెదిరింపులు ఎక్కడి నుంచి వచ్చాయి? దుండగుల ఉద్దేశ్యం ఏమిటి? అనే కోణాల్లో సైబర్ క్రైమ్ విభాగం కూడా విచారణ చేపట్టింది.   ఇప్పటికే ఒకసారి నకిలీ బెదిరింపులుగా తేలినా, కొన్ని గంటల వ్యవధిలోనే మళ్లీ బెదిరింపు రావడం కోర్టు వర్గాల్లో ఆందోళన కలిగిస్తోంది. న్యాయవాదులు, కక్షిదారులు భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం కోర్టు పరిసరాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు.

    ఇక్కడ క్లిక్ చేయండి ఇంకా చదవండి
    మునుపటి ఆర్టికల్
    ‘The Night Agent’ creator talks about shocking Season 3 twist
    తర్వాత ఆర్టికల్
    'KHxRK' promo: Kamal Haasan and Rajinikanth in one frame

    సంబంధిత తెలంగాణ అప్‌డేట్స్:

    మీరు ఖచ్చితంగా తొలగించాలనుకుంటున్నారా? ఈ కామెంట్ తొలగించబోతున్నారు..! తొలగించు రద్దు చేయి

    కామెంట్స్ (0)

      కామెంట్ రాయండి