శోధన

    వెబ్‌సైట్ భాషను ఎంచుకోండి

    జీడీపీఆర్ అనుగుణ్యత

    మా వెబ్‌సైట్‌లో మీకు ఉత్తమ అనుభవం అందించడానికి మేము కుకీలను ఉపయోగిస్తాము. మా సైట్‌ను కొనసాగించడం ద్వారా మీరు మా కుకీల వినియోగాన్ని అంగీకరిస్తున్నారు, గోప్యతా విధానం, మరియు సేవా నిబంధనలు.

    kntvtelugu
    kntvtelugu

    Bhanu Saptami: సూర్య అనుగ్రహానికి మహా శుభయోగం భాను సప్తమి..

    2 days ago

    భాను సప్తమి

    ఆదివారం రోజు సప్తమి తిథి కలిసివచ్చినప్పుడు ఏర్పడే విశేషమైన యోగాన్నే భాను సప్తమిగా శాస్త్రాలు పేర్కొంటాయి. ఇది సూర్యభగవానునికి అతి ప్రీతికరమైన దినం. ఈ రోజున సూర్యారాధన చేయడం వల్ల లక్ష రెట్ల పుణ్యఫలితం లభిస్తుందని ధర్మశాస్త్ర వచనం.

    ఆదివారం పాటించాల్సిన ముఖ్య నియమాలు

    ధర్మశాస్త్రాల ప్రకారం ఆదివారం రోజు కొన్ని నియమాలను తప్పనిసరిగా పాటించాలని చెప్పబడింది. ముఖ్యంగా భాను సప్తమి రోజున వీటికి మరింత ప్రాముఖ్యత ఉంది.

    • సూర్యోదయానికి పూర్వమే నిద్రలేవాలి

    • అభ్యంగన స్నానం చేయరాదు – కేవలం తలస్నానం మాత్రమే చేయాలి

    • ఒంటికి, తలకు నూనె రాయకూడదు

    • ఉల్లి, వెల్లుల్లి, మద్యం, మాంసాహారం త్యజించాలి

    • బ్రహ్మచర్యాన్ని పాటించాలి

    సూర్యారాధన వల్ల కలిగే ఫలితాలు

    నవగ్రహాలకు అధిపతి సూర్యభగవానుడు. ఆయన అనుగ్రహం ఉంటే అసాధ్యం అనేది ఉండదని శాస్త్రాలు స్పష్టం చేస్తున్నాయి.

    • విద్యలో ప్రగతి

    • వ్యాపారాభివృద్ధి

    • నిరుద్యోగులకు ఉద్యోగ లాభం

    • అవివాహితులకు వివాహం

    • సంతానప్రాప్తి

    • మనశ్శాంతి మరియు ఆరోగ్యం

    సూర్యారాధనతో లభించనిది ఏదీ లేదని పురాణాలు చెబుతున్నాయి.

    భాను సప్తమి విశేషం

    భాను సప్తమి ఒక సాధారణ రోజుకాదు. ఇది సూర్యునికి సంబంధించిన పర్వదినంలాంటిది. ఈ రోజున చేసే

    • స్నానం

    • దానం

    • జపం

    • హోమం

    లక్ష రెట్ల ఫలితాన్ని ఇస్తాయని శాస్త్రవచనం. ఈ రోజున ఆవుపాలతో చేసిన పరమాన్నాన్ని శ్రీ సూర్యభగవానునికి నివేదించడం అత్యంత శుభకరం.

    శాస్త్రోక్త హెచ్చరిక

    సూర్యోదయానికి ముందే నిద్రలేవక, ఆహార నియమాలు పాటించని వారికి అనారోగ్యం, రోగాలు, దారిద్ర్యం కలుగుతాయని పరమశివుడు స్వయంగా సూర్యాష్టకంలో పేర్కొన్నారు.

    శ్లోకం:

     
    ఆమిషం మధుపానం చ యః కరోతి రవేర్ధినే సప్త జన్మ భవేద్రోగీ జన్మ కర్మ దరిద్రతా స్త్రీ తైల మధు మాంసాని హస్త్యజేత్తు రవేర్ధినే న వ్యాధి శోక దారిద్ర్యం సూర్య లోకం స గచ్ఛతి

    భావార్థం:
    ఆదివారం రోజు మాంసం, మద్యం వంటి నిషిద్ధ పదార్థాలను సేవించేవారు ఏడు జన్మల వరకు రోగాలతో బాధపడతారు, దారిద్ర్యం వెంటాడుతుంది. స్త్రీ సమాగమం, తైలం రాయడం, మద్య–మాంసాలను ఆదివారం త్యజించినవారికి వ్యాధి, శోకం, దారిద్ర్యం ఉండదు. వారు సూర్యలోకాన్ని పొందుతారు.

    ఈ నియమాలు కేవలం భాను సప్తమికే కాదు, ప్రతి ఆదివారం తప్పనిసరిగా పాటించాలి అని శాస్త్ర సూచన.

    ఈ రోజున చేయవలసిన ఉత్తమ ఉపాసనలు

    భాను సప్తమి రోజున సూర్యానుగ్రహం కోసం క్రింది వాటిని పఠించడం అత్యంత శ్రేష్ఠం.

    • సూర్యాష్టకం

    • ఆదిత్య హృదయం

    • సూర్య ద్వాదశ నామాలు

    • సూర్య నమస్కారాలు

    సూర్య నమస్కారాలు చేయడం వల్ల ఇష్టకామ్య సిద్ధి, శుభఫలితాలు లభిస్తాయి.

    పురాణ ప్రాముఖ్యత

    శ్రీరామచంద్రుడు రావణునిపై విజయాన్ని సాధించడానికి ముందు సూర్యదేవుని ప్రార్థించిన విషయం అందరికీ తెలిసిందే. ప్రతిరోజూ సూర్యోదయ సమయంలో సూర్య నమస్కారాలు చేసే వారికి అన్ని రంగాల్లో విజయం సిద్ధిస్తుందని శాస్త్రాలు పేర్కొంటున్నాయి.   భాను సప్తమి సూర్య అనుగ్రహాన్ని పొందడానికి వచ్చిన అరుదైన శుభావకాశం. ఈ రోజును సద్వినియోగం చేసుకొని, ధర్మశాస్త్ర నియమాలను పాటిస్తూ సూర్యారాధన చేయడం వల్ల జీవితంలో శుభఫలితాలు, ఆరోగ్యం, శాంతి లభిస్తాయి.

     

     

    ఇక్కడ క్లిక్ చేయండి ఇంకా చదవండి
    మునుపటి ఆర్టికల్
    Inside Michael Keaton and Catherine O’Hara’s 40-year friendship
    తర్వాత ఆర్టికల్
    T20 WC: New Zealand seek all-round improvement vs Afghanistan

    సంబంధిత భక్తి శిఖరం అప్‌డేట్స్:

    మీరు ఖచ్చితంగా తొలగించాలనుకుంటున్నారా? ఈ కామెంట్ తొలగించబోతున్నారు..! తొలగించు రద్దు చేయి

    కామెంట్స్ (0)

      కామెంట్ రాయండి