శోధన

    వెబ్‌సైట్ భాషను ఎంచుకోండి

    జీడీపీఆర్ అనుగుణ్యత

    మా వెబ్‌సైట్‌లో మీకు ఉత్తమ అనుభవం అందించడానికి మేము కుకీలను ఉపయోగిస్తాము. మా సైట్‌ను కొనసాగించడం ద్వారా మీరు మా కుకీల వినియోగాన్ని అంగీకరిస్తున్నారు, గోప్యతా విధానం, మరియు సేవా నిబంధనలు.

    kntvtelugu
    kntvtelugu

    Bhadrachalam Sri Sita Ramachandra Swamy Templeలో సిబ్బంది చేతివాటం కలకలం

    14 hours ago

    భద్రాద్రి రామయ్య ఆలయంలో సిబ్బంది అక్రమాలు వెలుగులోకి రావడం భక్తుల్లో ఆగ్రహాన్ని రేకెత్తించింది. స్వామివారికి భక్తులు సమర్పించిన పట్టు వస్త్రాలు మాయం కావడంతో ఈ వ్యవహారం బయటపడింది.   ఆన్‌లైన్ విధానం అమల్లో ఉన్నప్పటికీ, కొంతమంది సిబ్బంది మాన్యువల్ రసీదుల ద్వారా విలువైన వస్త్రాలను పక్కదారి పట్టిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. విక్రయ కౌంటర్లలో రేట్లు మారుస్తూ అక్రమాలకు పాల్పడినట్టు కూడా సమాచారం. ఒక భక్తుడు సమర్పించిన వస్త్రాలు కనిపించకపోవడంతో అధికారుల దృష్టికి విషయం వెళ్లింది.

    దేవస్థానం ఈవో స్పందిస్తూ, అక్రమాలకు పాల్పడిన సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. పూర్తి స్థాయి విచారణకు ఆదేశాలు జారీ చేసినట్లు చెప్పారు.  ఈ ఘటనపై భక్తులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ, ఆలయ వ్యవహారాల్లో పారదర్శకత పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. ఆన్‌లైన్ విధానాన్ని కట్టుదిట్టంగా అమలు చేసి, సమర్పణల నిర్వహణలో స్పష్టత తీసుకురావాలని కోరుతున్నారు.

     

    ఇక్కడ క్లిక్ చేయండి ఇంకా చదవండి
    మునుపటి ఆర్టికల్
    Salim Khan hospitalized: Doctor shares health update
    తర్వాత ఆర్టికల్
    T20 World Cup Live: Brevis, Rickelton take South Africa closer to target

    సంబంధిత తెలంగాణ అప్‌డేట్స్:

    మీరు ఖచ్చితంగా తొలగించాలనుకుంటున్నారా? ఈ కామెంట్ తొలగించబోతున్నారు..! తొలగించు రద్దు చేయి

    కామెంట్స్ (0)

      కామెంట్ రాయండి