శోధన

    వెబ్‌సైట్ భాషను ఎంచుకోండి

    జీడీపీఆర్ అనుగుణ్యత

    మా వెబ్‌సైట్‌లో మీకు ఉత్తమ అనుభవం అందించడానికి మేము కుకీలను ఉపయోగిస్తాము. మా సైట్‌ను కొనసాగించడం ద్వారా మీరు మా కుకీల వినియోగాన్ని అంగీకరిస్తున్నారు, గోప్యతా విధానం, మరియు సేవా నిబంధనలు.

    kntvtelugu
    kntvtelugu

    Best Remedy For Knees Crack : వాతం, కీళ్ళ నొప్పులు తగ్గించుకునే ఆయుర్వేద ఆయిల్ రహస్యం

    1 day ago

    కణజాల క్షయం అంటే మన శరీరంలోని ముఖ్యమైన కణజాలాలు—కండరాలు, కొవ్వు, ద్రవాలు—వ్యాధులు లేదా పోషకాహార లోపం కారణంగా క్రమంగా క్షీణించడం, డ్రైగా మారడం. దీని ప్రభావంతో కీళ్ళు, కండరాలు బలహీనమై పనితీరు తగ్గుతుంది. సాధారణంగా COPD వంటి దీర్ఘకాలిక వ్యాధుల్లో ఈ సమస్య కనిపిస్తుంది. ప్రారంభ దశలో పెద్దగా ఇబ్బందిగా అనిపించకపోయినా, కాలక్రమేణా ఇది తీవ్రమైన సమస్యగా మారుతుంది. ఈ సమస్యను తగ్గించేందుకు ఆయుర్వేదంలో ఓ సులభమైన చిట్కా ఉంది. మంచి ఆయిల్‌తో రెగ్యులర్‌గా మసాజ్ చేయడం వల్ల కీళ్ళు బలపడటమే కాకుండా వాతం, నొప్పులు కూడా తగ్గుతాయని ఆయుర్వేదం చెబుతోంది. ఈ ఆయిల్ తయారీకి కావాల్సిన పదార్థాలన్నీ మన ఇంటి వంటగదిలోనే లభిస్తాయి.

    అయుర్వేద ఆయిల్ తయారీ విధానం

    ఒక గ్లాస్ కంటెయినర్ తీసుకుని అందులో

    లవంగాలు

    దాల్చిన చెక్క

    వాము / నల్ల మిరియాలు

    వేయాలి. మరోవైపు నువ్వుల నూనెను కొద్దిగా వేడి చేసి కాస్త చల్లారిన తర్వాత ఈ పదార్థాల్లో కలపాలి. అంతే… ఈ ఆయిల్‌ను మసాజ్‌కు ఉపయోగించవచ్చు. ఇది బామ్‌లా పనిచేస్తుంది. రాత్రి పడుకునే ముందు కనీసం 10 నిమిషాల పాటు మసాజ్ చేయాలి. రెగ్యులర్‌గా వాడితే నొప్పి తగ్గిన ఫలితం మీకే కనిపిస్తుంది.

    ఈ పదార్థాల వల్ల లాభాలు

    లవంగాలు: సహజమైన పెయిన్ రిలీవర్. ఇన్‌ఫ్లమేషన్ తగ్గించి కీళ్ళను బలపరుస్తాయి.

    దాల్చిన చెక్క: జాయింట్స్‌లో రక్త ప్రసరణను పెంచి స్టిఫ్‌నెస్, చలితనం తగ్గిస్తుంది.

    వాము / నల్ల మిరియాలు: ఇందులోని పెపెరిన్ వాతం వల్ల వచ్చే నొప్పి, ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది.

    నువ్వుల నూనె: ఆయుర్వేదంలో అత్యుత్తమమైన నూనె. కణజాలాలను పోషించి కీళ్ళకు బలం ఇస్తుంది.

    ఇవి అన్నీ ఇంట్లో ఉండే సాధారణ పదార్థాలే అయినా, కీళ్ళ నొప్పులు, బలహీనతను తగ్గించడంలో చాలా ప్రభావవంతంగా పనిచేస్తాయి.

     

    ఇక్కడ క్లిక్ చేయండి ఇంకా చదవండి
    మునుపటి ఆర్టికల్
    What Is The Best Cryptocurrency To Invest In During This Market Phase?
    తర్వాత ఆర్టికల్
    'Stop the lip service': Ex-India cricketer's blunt message after Nepal stun the T20 WC

    సంబంధిత హెల్త్ & లైఫ్ స్టైల్ అప్‌డేట్స్:

    మీరు ఖచ్చితంగా తొలగించాలనుకుంటున్నారా? ఈ కామెంట్ తొలగించబోతున్నారు..! తొలగించు రద్దు చేయి

    కామెంట్స్ (0)

      కామెంట్ రాయండి