శోధన

    వెబ్‌సైట్ భాషను ఎంచుకోండి

    జీడీపీఆర్ అనుగుణ్యత

    మా వెబ్‌సైట్‌లో మీకు ఉత్తమ అనుభవం అందించడానికి మేము కుకీలను ఉపయోగిస్తాము. మా సైట్‌ను కొనసాగించడం ద్వారా మీరు మా కుకీల వినియోగాన్ని అంగీకరిస్తున్నారు, గోప్యతా విధానం, మరియు సేవా నిబంధనలు.

    kntvtelugu
    kntvtelugu

    BCB Chairman Aminul Islam : టీ20 ప్రపంచకప్ 2026: భారత్-పాక్ వివాదం మరో మలుపు..

    2 రోజులు క్రితం

    కొలంబో / కరాచీ:
    టీ20 ప్రపంచకప్‌–2026లో భారత్‌–పాకిస్థాన్ మధ్య మ్యాచ్ వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. శ్రీలంక వేదికగా భారత్‌తో జరగాల్సిన మ్యాచ్‌ను పాకిస్థాన్ బహిష్కరించిన విషయం తెలిసిందే. బంగ్లాదేశ్‌ను టోర్నీ నుంచి ఐసీసీ తప్పించడాన్ని వ్యతిరేకిస్తూ పాకిస్థాన్ ఈ నిర్ణయం తీసుకుంది.  ఈ వివాదానికి పరిష్కారం కనుగొనే ప్రయత్నాల్లో భాగంగా ఐసీసీ, పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) మధ్య వర్చువల్ సమావేశం జరగనుంది. ఇదే సమయంలో ఈ వ్యవహారం మరో కీలక మలుపు తిరిగింది. బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ అమిన్ ఉల్ ఇస్లామ్ కరాచీకి చేరుకుని పీసీబీ ఛైర్మన్ నఖ్వీని కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఆయన కూడా ఐసీసీ–పీసీబీ వర్చువల్ సమావేశంలో పాల్గొనే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

    ఈ అంశంపై శ్రీలంక క్రికెట్ బోర్డు ఇప్పటికే పీసీబీకి లేఖ రాసి, తమ నిర్ణయాన్ని పునఃసమీక్షించుకోవాలని కోరింది. ఈ పరిణామాల తర్వాత పాకిస్థాన్ వైఖరిలో కొంత మార్పు వచ్చినట్లు సమాచారం. ఇదిలా ఉండగా, ప్రకృతి వైపరీత్యాలు లేదా యుద్ధం వంటి అనూహ్య పరిస్థితుల్లో వర్తించే ‘ఫోర్స్ మెజ్యూర్’ నిబంధన కింద తమకు మినహాయింపు ఇవ్వాలని పాక్ ఐసీసీని కోరినట్లు తెలుస్తోంది. అయితే వాస్తవంగా విపత్కర పరిస్థితులు లేకపోయినా ఈ నిబంధనను సాకుగా చూపి తప్పించుకోవాలని పీసీబీ ప్రయత్నిస్తోందని ఐసీసీ భావించినట్లు సమాచారం. దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ఐసీసీ, వివరణ ఇవ్వాలని పీసీబీని ఆదేశించింది. సరైన కారణాలు చూపలేకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించినట్లు తెలుస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో భారత్‌తో మ్యాచ్ ఆడే పరిస్థితులు ఏర్పడే అవకాశాలు ఉన్నాయని ఐసీసీ డైరెక్టర్ ఒకరు అభిప్రాయం వ్యక్తం చేసినట్లు సమాచారం. షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 15న కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో భారత్-పాక్ మ్యాచ్ జరగాల్సి ఉంది.

     

    ఇక్కడ క్లిక్ చేయండి ఇంకా చదవండి
    మునుపటి ఆర్టికల్
    SL vs IRE Live Score: Kusal Mendis' 56 takes Sri Lanka to 163/6 in 20 overs
    తర్వాత ఆర్టికల్
    Placed alongside India and Pak, Namibia captain says there are 'no minnows' in T20

    సంబంధిత క్రీడలు అప్‌డేట్స్:

    మీరు ఖచ్చితంగా తొలగించాలనుకుంటున్నారా? ఈ కామెంట్ తొలగించబోతున్నారు..! తొలగించు రద్దు చేయి

    కామెంట్స్ (0)

      కామెంట్ రాయండి