శోధన

    వెబ్‌సైట్ భాషను ఎంచుకోండి

    జీడీపీఆర్ అనుగుణ్యత

    మా వెబ్‌సైట్‌లో మీకు ఉత్తమ అనుభవం అందించడానికి మేము కుకీలను ఉపయోగిస్తాము. మా సైట్‌ను కొనసాగించడం ద్వారా మీరు మా కుకీల వినియోగాన్ని అంగీకరిస్తున్నారు, గోప్యతా విధానం, మరియు సేవా నిబంధనలు.

    kntvtelugu
    kntvtelugu

    Aus Vs Zim T20 World Cup 2026 : ఐసీసీ టీ20 వరల్డ్‌కప్ 2026: ఆస్ట్రేలియాకు జింబాబ్వే షాక్

    13 hours ago

    కొలంబోలో జరిగిన మ్యాచ్‌లో జింబాబ్వే సంచలన విజయం సాధించింది. సికందర్ రజా సారథ్యంలో జింబాబ్వే జట్టు అద్భుత ప్రదర్శనతో ఆస్ట్రేలియాపై 23 పరుగుల తేడాతో గెలిచింది.  టాస్ గెలిచిన ఆస్ట్రేలియా కెప్టెన్ ట్రావిస్ హెడ్ బౌలింగ్ ఎంచుకోగా, జింబాబ్వే ఓపెనర్లు దూకుడుగా ఆడారు. బ్రియాన్ బెన్నెట్ (64 నాటౌట్), మారుమని (35) తొలి వికెట్‌కు 73 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. చివర్లో సికందర్ రజా వేగంగా 23 పరుగులు చేయడంతో జింబాబ్వే 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది.

     

    170 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియాకు ఆరంభంలోనే గట్టి దెబ్బ తగిలింది. జోష్ ఇంగ్లిస్ (8), కామెరూన్ గ్రీన్ (0), టిమ్ డేవిడ్ (0), ట్రావిస్ హెడ్ (17) త్వరగా అవుటవ్వడంతో జట్టు ఒత్తిడిలో పడింది. గ్లెన్ మ్యాక్స్‌వెల్ (31), మ్యాథ్యూ రెన్షా (65) పోరాడినా ఫలితం లేకపోయింది. 19.3 ఓవర్లలో 146 పరుగులకు ఆలౌట్ అయింది.  జింబాబ్వే బౌలర్లలో ముజర్బానీ 4 వికెట్లు, బ్రాడ్ ఎవాన్స్ 3 వికెట్లు తీసి విజయంలో కీలక పాత్ర పోషించారు. ఈ విజయంతో జింబాబ్వే టోర్నీలో బలమైన సందేశం ఇచ్చింది.

    ఇక్కడ క్లిక్ చేయండి ఇంకా చదవండి
    మునుపటి ఆర్టికల్
    T20 World Cup 2026: Canada opt to bat vs UAE
    తర్వాత ఆర్టికల్
    Listening Party: Harry Styles adds Mumbai city

    సంబంధిత క్రీడలు అప్‌డేట్స్:

    మీరు ఖచ్చితంగా తొలగించాలనుకుంటున్నారా? ఈ కామెంట్ తొలగించబోతున్నారు..! తొలగించు రద్దు చేయి

    కామెంట్స్ (0)

      కామెంట్ రాయండి