శోధన

    భాషా అమరికలు
    వెబ్‌సైట్ భాషను ఎంచుకోండి

    జీడీపీఆర్ అనుగుణ్యత

    మా వెబ్‌సైట్‌లో మీకు ఉత్తమ అనుభవం అందించడానికి మేము కుకీలను ఉపయోగిస్తాము. మా సైట్‌ను కొనసాగించడం ద్వారా మీరు మా కుకీల వినియోగాన్ని అంగీకరిస్తున్నారు, గోప్యతా విధానం, మరియు సేవా నిబంధనలు.

    kntvtelugu
    kntvtelugu

    AP deputy CM Pawan Kalyan : విశాఖ జూ పార్క్‌ను పరిశీలించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్

    1 వారం క్రితం

     

    జిరాఫీల దత్తత, జంతు సంరక్షణపై కీలక ప్రకటన

     

    రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, అటవీ–పర్యావరణ శాఖల మంత్రి పవన్ కళ్యాణ్ విశాఖపట్నం పర్యటనలో భాగంగా ఇందిరా గాంధీ జంతు ప్రదర్శనశాలను సందర్శించి పలు విభాగాలను పరిశీలించారు.

     

    తల్లి శ్రీమతి అంజనా దేవి గారి జన్మదినోత్సవం సందర్భంగా జూ పార్క్‌లోని రెండు జిరాఫీలను ఏడాదిపాటు దత్తత తీసుకుంటున్నట్లు ఉప ముఖ్యమంత్రి ప్రకటించారు. ఈ రెండు జిరాఫీలకు ఏడాదిపాటు అయ్యే మొత్తం ఖర్చును తానే భరిస్తానని వెల్లడించారు. జంతు సంరక్షణకు కార్పొరేట్ సంస్థలు, ప్రజలు ముందుకు రావాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు.

     

    జూ పార్క్‌లో నూతనంగా నిర్మించిన ఎలుగుబంట్ల ఎన్‌క్లోజర్‌ను పవన్ కళ్యాణ్ ప్రారంభించారు. అనంతరం నీటి ఏనుగులు, నల్ల ఎలుగుబంట్లు, పులులు, సింహాల ఎన్‌క్లోజర్లను సందర్శించి, వాటికి అందిస్తున్న ఆహారం, సంరక్షణ విధానాలు, జంతువుల పేర్లు తదితర వివరాలను జూ క్యూరేటర్‌ను అడిగి తెలుసుకున్నారు.

     

    ఏనుగులు, జిరాఫీల శాలలను పరిశీలించిన ఉప ముఖ్యమంత్రి, స్వయంగా వాటికి ఆహారం అందించారు. ఈ సందర్భంగా జూ నిబంధనలను పూర్తిగా పాటిస్తూ జంతువుల పట్ల తన అభిమానం, బాధ్యతను చాటుకున్నారు.

     

    అనంతరం కంబాలకొండ ఎకో పార్క్‌ను సందర్శించిన పవన్ కళ్యాణ్ నగర వనాన్ని ప్రారంభించారు. ఎకో పార్క్‌లో ఏర్పాటు చేసిన చెక్క వంతెనపై కనోపీ వాక్ చేస్తూ, మార్గం మధ్యలో వివిధ మొక్కల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.

     

    ఈ పర్యటన ద్వారా పర్యావరణ పరిరక్షణ, జంతు సంరక్షణపై రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు మరింత బలం చేకూరిందని అధికారులు పేర్కొన్నారు.

     

     

    ఇక్కడ క్లిక్ చేయండి ఇంకా చదవండి
    మునుపటి ఆర్టికల్
    Why Japanese toilets are used facing forward and most visitors get it wrong
    తర్వాత ఆర్టికల్
    'They don't have guts': Rahane mocks Pakistan over T20 WC boycott threat

    సంబంధిత ఆంధ్రప్రదేశ్ అప్‌డేట్స్:

    మీరు ఖచ్చితంగా తొలగించాలనుకుంటున్నారా? ఈ కామెంట్ తొలగించబోతున్నారు..! తొలగించు రద్దు చేయి

    కామెంట్స్ (0)

      కామెంట్ రాయండి