శోధన

    వెబ్‌సైట్ భాషను ఎంచుకోండి

    జీడీపీఆర్ అనుగుణ్యత

    మా వెబ్‌సైట్‌లో మీకు ఉత్తమ అనుభవం అందించడానికి మేము కుకీలను ఉపయోగిస్తాము. మా సైట్‌ను కొనసాగించడం ద్వారా మీరు మా కుకీల వినియోగాన్ని అంగీకరిస్తున్నారు, గోప్యతా విధానం, మరియు సేవా నిబంధనలు.

    kntvtelugu
    kntvtelugu

    AndhraPradesh PublicHealth DialysisCenter : గుడివాడలో ఆరోగ్య కేంద్రాల దారుణ స్థితి: అసెంబ్లీలో ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ఆవేదన

    15 hours ago

    Venigandla Ramu గుడివాడ నియోజకవర్గంలోని ఆరోగ్య కేంద్రాల దుస్థితిని అసెంబ్లీ క్వశ్చన్ అవర్‌లో ప్రస్తావించారు. గత ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి కారణంగా ప్రైమరీ హెల్త్ సెంటర్ల (P.H.C) వ్యవస్థ అస్తవ్యస్తంగా మారిందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా పిహెచ్సిల పరిస్థితి దారుణంగా ఉందని, నిర్మాణాలకు శంకుస్థాపనలు చేసినా పూర్తి చేయడంలో విఫలమయ్యారని విమర్శించారు.  గుడివాడ పట్టణంలో ఐదు అర్బన్ హెల్త్ సెంటర్లు మంజూరు కాగా, బాపూజీ నగర్‌లో ఒకటే పూర్తి నిర్మాణం పొందిందన్నారు. పురపాలక సంఘ నిధులతో బేతవోలు హెల్త్ సెంటర్‌ను అభివృద్ధి చేసినట్లు చెప్పారు. అయితే ధనియాలపేట, స్లేటర్‌పేట ప్రాంతాల్లో నిర్మాణాలు పునాది దశలోనే నిలిచిపోయాయని అసెంబ్లీ దృష్టికి తీసుకువచ్చారు. గతంలో మంజూరైన రూ.80 లక్షల నిధులు వ్యయభారం పెరగడంతో సరిపోవడం లేదని, భవన నిర్మాణాలకు అదనంగా రూ.1.46 కోట్లు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.

    నందివాడ మండలం రుద్రపాకలో 30 పడకల ఆసుపత్రి ఉన్నప్పటికీ, పూర్తి స్థాయి సిహెచ్సిగా అభివృద్ధి చేయడానికి అవసరమైన నిధులు మంజూరు చేయాలని కోరారు. రామాపురం, మోటూరు, కౌతవరం ప్రాంతాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు శిధిలావస్థకు చేరుకున్నాయని తెలిపారు. గుడివాడలో వంద పడకల ఏరియా ఆసుపత్రిలో డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేయాలని కూడా ఆయన డిమాండ్ చేశారు. ఆరోగ్య కేంద్రాల్లో పారదర్శక వైద్య సేవలు అందిస్తున్న ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతూ, మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఈ అంశాలపై మంత్రి Y. Satya Kumar Yadav అసెంబ్లీలో సమాధానం ఇచ్చారు. ప్రభుత్వం ఆరోగ్య రంగంలో సమస్యలను గుర్తించి దశలవారీగా పరిష్కరిస్తుందని తెలిపారు.

     

    ఇక్కడ క్లిక్ చేయండి ఇంకా చదవండి
    మునుపటి ఆర్టికల్
    Inside Robert Pattinson’s USD 100 million fortune
    తర్వాత ఆర్టికల్
    Gold Prices Slip Further Today (Feb 18), Check 22K & 24K Rates Per Gram In Major Cities

    సంబంధిత ఆంధ్రప్రదేశ్ అప్‌డేట్స్:

    మీరు ఖచ్చితంగా తొలగించాలనుకుంటున్నారా? ఈ కామెంట్ తొలగించబోతున్నారు..! తొలగించు రద్దు చేయి

    కామెంట్స్ (0)

      కామెంట్ రాయండి