శోధన

    భాషా అమరికలు
    వెబ్‌సైట్ భాషను ఎంచుకోండి

    జీడీపీఆర్ అనుగుణ్యత

    మా వెబ్‌సైట్‌లో మీకు ఉత్తమ అనుభవం అందించడానికి మేము కుకీలను ఉపయోగిస్తాము. మా సైట్‌ను కొనసాగించడం ద్వారా మీరు మా కుకీల వినియోగాన్ని అంగీకరిస్తున్నారు, గోప్యతా విధానం, మరియు సేవా నిబంధనలు.

    kntvtelugu
    kntvtelugu

    Andhra Pradesh Deputy Cm Pawan Kalyan : ప్రజల సంతోషమే లక్ష్యం… సంక్షేమమే ధ్యేయం

    1 వారం క్రితం

    • అలసత్వం, అవినీతికి తావు లేదు: ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్

    విశాఖపట్నం, జనవరి 30:
    ప్రజల సంతోషం, సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పని చేస్తోందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్–గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటిసరఫరా శాఖల మంత్రి  పవన్ కళ్యాణ్ గారు స్పష్టం చేశారు. విధి నిర్వహణలో అలసత్వం, నిర్లక్ష్యాన్ని ఏ మాత్రం సహించబోమని, నిర్దేశిత లక్ష్యాలను చేరుకోలేకపోయినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. శుక్రవారం విశాఖ కలెక్టరేట్‌లో ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ, గ్రామీణ నీటిసరఫరా (RWS), పీఆర్ ఇంజినీరింగ్ విభాగాల అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉపాధి హామీ పథకం కింద పల్లెపండగ 1.0, పల్లెపండగ 2.0, అడవితల్లి బాట, జల్ జీవన్ మిషన్ వంటి పథకాల అమలుపై సమగ్రంగా సమీక్షించారు.

     

    ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ, “కూటమి ప్రభుత్వం నిబద్ధత, పారదర్శకతతో ముందుకు సాగుతోంది. గత ప్రభుత్వం పంచాయతీరాజ్ శాఖను నిర్వీర్యం చేసి, వేల కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసింది. జల్ జీవన్ మిషన్ పేరుతో రూ.4 వేల కోట్ల వరకు నిధులు దారి మళ్లాయి. రికార్డుల్లో పనులు కనిపిస్తున్నాయే తప్ప, ఒక్క ఇంటికీ నీరు చేరిన దాఖలాలు లేవు” అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పంచాయతీరాజ్ వ్యవస్థను మళ్లీ బలోపేతం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం సంస్కరణలు అమలు చేస్తోందని తెలిపారు. “పొగడ్తలు నాకు అవసరం లేదు… పని కావాలి. ఉన్నతాధికారి నుంచి ఫీల్డ్ అసిస్టెంట్ వరకు ప్రతి ఒక్కరూ చిత్తశుద్ధి, జవాబుదారీతనంతో పని చేయాలి. సోషల్ ఆడిట్ కూడా మొక్కుబడిగా కాకుండా పక్కాగా జరగాలి” అని ఆదేశించారు.

     

    తన వైపు నుంచి ఎలాంటి రాజకీయ సిఫార్సులు, ఒత్తిళ్లు ఉండవని స్పష్టం చేస్తూ, నిబంధనల మేరకే అధికారులు పని చేయాలని సూచించారు. గత ప్రభుత్వ నాయకులతో సంబంధాలు కొనసాగిస్తూ పనిలో నిర్లక్ష్యం వహిస్తున్న అధికారులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పంచాయతీరాజ్ శాఖను ప్రభావవంతమైన శాఖగా తీర్చిదిద్దేందుకు ఉద్యోగులకు అన్ని విధాలా అండగా నిలుస్తున్నామని, ఒకేసారి 10 వేల మందికి పదోన్నతులు కల్పించడమే ఇందుకు నిదర్శనమన్నారు.

     

    రాష్ట్ర అభివృద్ధి కోసం  ముఖ్యమంత్రి  నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రభుత్వం కృషి చేస్తోందని, కేంద్రం నుంచి నిధులు తీసుకురావడంలోనూ ప్రయత్నాలు కొనసాగుతున్నాయని తెలిపారు. “ప్రజల సంక్షేమం, సంతోషమే లక్ష్యంగా అధికారులు కూడా ప్రభుత్వ సంకల్పానికి తోడుగా నిలవాలి” అని పవన్ కళ్యాణ్ గారు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో విశాఖ దక్షిణ శాసనసభ్యులు  వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్, ఉపాధి హామీ పథకం డైరెక్టర్ శ్రీ షణ్ముఖ్ కుమార్, విశాఖపట్నం కలెక్టర్  హరీంద్రప్రసాద్‌తో పాటు రాష్ట్ర, జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.

     

    ఇక్కడ క్లిక్ చేయండి ఇంకా చదవండి
    మునుపటి ఆర్టికల్
    Australian Open: The agony of being Zverev in the age of Carlos Alcaraz
    తర్వాత ఆర్టికల్
    5 passports that saw sharp power declines in the recent times

    సంబంధిత ఆంధ్రప్రదేశ్ అప్‌డేట్స్:

    మీరు ఖచ్చితంగా తొలగించాలనుకుంటున్నారా? ఈ కామెంట్ తొలగించబోతున్నారు..! తొలగించు రద్దు చేయి

    కామెంట్స్ (0)

      కామెంట్ రాయండి