శోధన

    భాషా అమరికలు
    వెబ్‌సైట్ భాషను ఎంచుకోండి

    జీడీపీఆర్ అనుగుణ్యత

    మా వెబ్‌సైట్‌లో మీకు ఉత్తమ అనుభవం అందించడానికి మేము కుకీలను ఉపయోగిస్తాము. మా సైట్‌ను కొనసాగించడం ద్వారా మీరు మా కుకీల వినియోగాన్ని అంగీకరిస్తున్నారు, గోప్యతా విధానం, మరియు సేవా నిబంధనలు.

    kntvtelugu
    kntvtelugu

    Amravati Hotel Ring Road : అమరావతి ORR వెడల్పు తగ్గించాలి : కలెక్టర్‌కు రైతుల వినతిపత్రం

    4 days ago

     

    కంచికచర్ల, ఫిబ్రవరి 02 (వెబ్‌న్యూస్):

    అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు (ORR) కింద భూములు కోల్పోబోయే రైతులకు బహిరంగ మార్కెట్ విలువ ప్రకారం నష్టపరిహారం చెల్లించాలని, అలాగే రోడ్డు వెడల్పును తగ్గించాలని కోరుతూ యన్టీఆర్ జిల్లా రైతులు విజయవాడలో జిల్లా కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు.

     

    కంచికచర్ల, వీరులపాడు, జి.కొండూరు, మైలవరం మండలాలకు చెందిన సన్నకారు, చిన్నకారు రైతులు తరతరాలుగా అనుభవిస్తున్న పిత్రార్జిత భూములు ORR కారణంగా కోల్పోయే ప్రమాదంలో ఉన్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ భూములు వర్షాధార వ్యవసాయం, లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా సాగుచేస్తూ, పత్తి, మొక్కజొన్న వంటి పంటలపై ఆధారపడి జీవనం కొనసాగిస్తున్నామని తెలిపారు.

     

    ప్రకృతి వైపరీత్యాలు, కరువు, అడవిపందులు, కోతుల బెడద, పంటలకు గిట్టుబాటు ధరలు లేకపోవడం వంటి సమస్యల మధ్య కూడా రైతులు తీవ్ర కష్టాలతో వ్యవసాయం కొనసాగిస్తున్నారని పేర్కొన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో భూముల స్వాధీనం రైతుల జీవనాధారాన్ని పూర్తిగా దెబ్బతీస్తుందని, భవిష్యత్తుపై తీవ్ర అనిశ్చితి నెలకొందని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు.

     

    ప్రభుత్వం మొదట ORR వెడల్పును 140 మీటర్లుగా ప్రతిపాదించిందని, అయితే తాజా గెజిట్ నోటిఫికేషన్ (05-01-2026) ప్రకారం వెడల్పును 250 మీటర్లకు పెంచడంతో పాటు, 500 మీటర్ల బఫర్ జోన్ ఉంటుందనే ప్రచారం జరుగుతోందని రైతులు తెలిపారు. దీని వల్ల విస్తారమైన ప్రైవేట్ భూమి సేకరణ జరుగుతుందని, ఇది మితిమీరిన ఏకపక్ష నిర్ణయమని విమర్శించారు.

     

    సాంకేతిక, సాధ్యాసాధ్యాల అధ్యయనం చేసి ORR వెడల్పును కనీసం 70 మీటర్లకు తగ్గించాలని రైతులు డిమాండ్ చేశారు. భూసేకరణ చట్టంలోని సెక్షన్ 26(1) ప్రకారం గత మూడు సంవత్సరాల్లో పరిసర ప్రాంతాల్లో నమోదైన అత్యధిక అమ్మకపు ధర ఆధారంగా నష్టపరిహారం నిర్ణయించి, దానికి నాలుగు రెట్లు చెల్లించాలని చట్టం చెబుతోందని గుర్తు చేశారు. రైతు సంఘాలు ఆరు రెట్లు నష్టపరిహారం ఇవ్వాలని కోరుతున్నాయని తెలిపారు.

     

    రిజిస్ట్రార్ కార్యాలయం నిర్ణయించిన విలువ చాలా తక్కువగా ఉందని, నిజమైన బహిరంగ మార్కెట్ విలువను పరిగణనలోకి తీసుకోవాలని రైతులు విజ్ఞప్తి చేశారు. భూసేకరణకు ముందు రైతులతో చర్చలు జరిపి, వారి అంగీకారం తీసుకోవాలని కూడా డిమాండ్ చేశారు.

     

    ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రభుత్వం తో మాట్లాడి రైతులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు రైతులు తెలిపారు.

     

    ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం యన్టీఆర్ జిల్లా కార్యదర్శి పగడాల వీరాంజనేయులు, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం యన్టీఆర్ జిల్లా కార్యదర్శి కోట కళ్యాణ్‌తో పాటు నన్నపనేని భాస్కరరావు, గంగిరెడ్డి రంగారావు, మల్లెల సుబ్బారావు, బుడ్డి వీర ప్రసాద్, కె.ఎస్.ఎస్. ప్రసాద్, రాజశేఖర్ తదితర రైతులు పాల్గొన్నారు.

     

    ఇక్కడ క్లిక్ చేయండి ఇంకా చదవండి
    మునుపటి ఆర్టికల్
    5 important steps to take while giving your house on rent
    తర్వాత ఆర్టికల్
    India A vs USA: Tilak Varma ticks all boxes on return, ready for T20 World Cup

    సంబంధిత ఆంధ్రప్రదేశ్ అప్‌డేట్స్:

    మీరు ఖచ్చితంగా తొలగించాలనుకుంటున్నారా? ఈ కామెంట్ తొలగించబోతున్నారు..! తొలగించు రద్దు చేయి

    కామెంట్స్ (0)

      కామెంట్ రాయండి