శోధన

    వెబ్‌సైట్ భాషను ఎంచుకోండి

    జీడీపీఆర్ అనుగుణ్యత

    మా వెబ్‌సైట్‌లో మీకు ఉత్తమ అనుభవం అందించడానికి మేము కుకీలను ఉపయోగిస్తాము. మా సైట్‌ను కొనసాగించడం ద్వారా మీరు మా కుకీల వినియోగాన్ని అంగీకరిస్తున్నారు, గోప్యతా విధానం, మరియు సేవా నిబంధనలు.

    kntvtelugu
    kntvtelugu

    Abhishek Sharma : విమర్శలకు అభిషేక్ సమాధానం – హార్డ్‌వర్క్‌పైనే నమ్మకం

    10 hours ago

    టీ20 ప్రపంచ కప్ 2026లో భారీ అంచనాల నడుమ బరిలోకి దిగిన టీమిండియా స్టార్ బ్యాటర్ Abhishek Sharma తీవ్రంగా విఫలమైన విషయం తెలిసిందే. ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ డకౌట్‌గా పెవిలియన్ చేరడంతో అభిమానులు, క్రికెట్ విశ్లేషకుల్లో ఆందోళన నెలకొంది. ముఖ్యంగా ప్రపంచ టీ20 ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో ఉన్న ఆటగాడి నుంచి ఇలాంటి ప్రదర్శన రావడం చర్చనీయాంశమైంది.

    సూపర్ 8లో భాగంగా ఆదివారం భారత్–సౌతాఫ్రికా మ్యాచ్‌కు ముందు అభిషేక్ తన ఫామ్‌పై స్పందించాడు.

    “నాకు బ్యాటింగ్ అంటే చాలా ఇష్టం. రెండేళ్ల క్రితమే చిన్న విషయాలకు ఒత్తిడి తీసుకోవడం మానేశా. నేను నా హార్డ్‌వర్క్‌ను మాత్రమే నమ్ముతా. మన చేతిలో ఉండేది ప్రాక్టీస్, ట్రైనింగ్ మాత్రమే. వాటినే కొనసాగిస్తా. కెరీర్‌లో ఎత్తుపల్లాలు సహజం. కొన్ని ఇన్నింగ్స్‌ల్లో పరుగులు వస్తాయి.. కొన్నిసార్లు రావు. కానీ ఏమి జరిగినా నా బ్యాటింగ్ శైలిలో మార్పు ఉండకూడదని నిర్ణయించుకున్నా. ఫలితం రాకపోయినా నా ఆటతీరును మార్చను. ఇదే దూకుడును కొనసాగిస్తా” అని స్పష్టం చేశాడు.     అభిషేక్ ధైర్యవంతమైన ఈ వ్యాఖ్యలు అభిమానుల్లో కొంత నమ్మకాన్ని పెంచాయి. సౌతాఫ్రికాతో మ్యాచ్‌లో అతడు తన అసలు ఫామ్‌ను తిరిగి సాధిస్తాడా? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

    ఇక్కడ క్లిక్ చేయండి ఇంకా చదవండి
    మునుపటి ఆర్టికల్
    India sealT20I series in Australia as Mandhana hits fifty in final match
    తర్వాత ఆర్టికల్
    T20 World Cup Live: Colombo rain puts PAK vs NZ Super 8 clash in danger

    సంబంధిత క్రీడలు అప్‌డేట్స్:

    మీరు ఖచ్చితంగా తొలగించాలనుకుంటున్నారా? ఈ కామెంట్ తొలగించబోతున్నారు..! తొలగించు రద్దు చేయి

    కామెంట్స్ (0)

      కామెంట్ రాయండి