శోధన

    వెబ్‌సైట్ భాషను ఎంచుకోండి

    జీడీపీఆర్ అనుగుణ్యత

    మా వెబ్‌సైట్‌లో మీకు ఉత్తమ అనుభవం అందించడానికి మేము కుకీలను ఉపయోగిస్తాము. మా సైట్‌ను కొనసాగించడం ద్వారా మీరు మా కుకీల వినియోగాన్ని అంగీకరిస్తున్నారు, గోప్యతా విధానం, మరియు సేవా నిబంధనలు.

    kntvtelugu
    kntvtelugu

    **8.25% Interest Credited to PF Accounts : పీఎఫ్ ఖాతాల్లో 8.25% వడ్డీ జమ ప్రారంభం.. ఉద్యోగులకు కేంద్రం గుడ్ న్యూస్

    13 hours ago

    పీఎఫ్ ఖాతాదారులకు కేంద్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ అందించింది. దేశవ్యాప్తంగా కోట్లాది మంది ఉద్యోగులకు చెందిన ప్రావిడెంట్ ఫండ్ ఖాతాల్లో వడ్డీ జమ ప్రక్రియ ప్రారంభమైనట్లు అధికారులు వెల్లడించారు. Employees' Provident Fund Organisation (EPFO) 2023-24 ఆర్థిక సంవత్సరానికి 8.25 శాతం వడ్డీ రేటును ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ రేటు ప్రకారం సభ్యుల ఖాతాల్లో ఉన్న నిల్వలపై వడ్డీ లెక్కించి జమ చేస్తోంది. గత సంవత్సరాలతో పోలిస్తే ఈ వడ్డీ రేటు కొంత మెరుగ్గా ఉండటంతో ఉద్యోగులకు ఊరట కలిగిస్తోంది.

     

    ఎక్కువకాలంగా పీఎఫ్ కాంట్రిబ్యూషన్ చేస్తున్న వారికి గణనీయమైన లాభం చేకూరుతోంది. ఉదాహరణకు, ఖాతాలో రూ.5.5 లక్షల నిల్వ ఉంటే 8.25 శాతం వడ్డీ ప్రకారం సుమారు రూ.45 వేల నుంచి రూ.46 వేల వరకు జమయ్యే అవకాశం ఉంది. వడ్డీ జమ అయ్యిందో లేదో తెలుసుకోవాలంటే EPFO అధికారిక వెబ్‌సైట్‌లో UAN నంబర్, పాస్‌వర్డ్‌తో లాగిన్ అయి ‘పాస్‌బుక్’ ఆప్షన్ ద్వారా చెక్ చేసుకోవచ్చు. అలాగే రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుంచి మిస్డ్ కాల్ లేదా SMS ద్వారా కూడా బ్యాలెన్స్ వివరాలు తెలుసుకోవచ్చు.

    ఇక్కడ క్లిక్ చేయండి ఇంకా చదవండి
    మునుపటి ఆర్టికల్
    Shikhar Dhawan shares Sangeet night pictures with Sophie Shine
    తర్వాత ఆర్టికల్
    Regina Cassandra calls out Bollywood double standards

    సంబంధిత బిజినెస్ అప్‌డేట్స్:

    మీరు ఖచ్చితంగా తొలగించాలనుకుంటున్నారా? ఈ కామెంట్ తొలగించబోతున్నారు..! తొలగించు రద్దు చేయి

    కామెంట్స్ (0)

      కామెంట్ రాయండి