kntv
kntv

సూళ్లూరుపేటలో విషాదం

1 hour ago

సూళ్లూరుపేటలోని కాపు వీధిలో విషాద ఘటన చోటుచేసుకుంది. నిర్మాణంలో ఉన్న అపార్ట్‌మెంట్ ఐదో అంతస్తు నుంచి పడి భవన నిర్మాణ కార్మికుడు జయంపు రాము (32) మృతిచెందాడు. బతుకుదెరువు కోసం నెల రోజుల క్రితం పట్టణానికి వచ్చిన రాము, కనిగిరి సమీపంలోని కాశీంపేట కాలనీకి చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు.