kntv
kntv

స్పెయిన్‌కు చేరుకున్న భారత యుద్ధనౌక ఐఎన్‌ఎస్ త్రిశూల్

52 minutes ago

భారత నౌకాదళానికి చెందిన ఐఎన్‌ఎస్ త్రిశూల్ యుద్ధనౌక సెప్టెంబర్ 30న స్పెయిన్‌లోని వలెన్సియా నౌకాశ్రయానికి చేరుకుంది. స్పెయిన్ నౌకాదళంతో వృత్తిపరమైన చర్చలు, నౌకల సందర్శనలు, క్రీడా, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొననుంది. ఈ పర్యటన రెండు నౌకాదళాల మధ్య అనుభవాల మార్పిడికి, పరస్పర అవగాహన పెంపునకు దోహదపడనుంది.