వాటర్ డిస్పెన్సరీ యంత్రాంగం పోలీస్ స్టేషన్ కు వితరణ చేసిన వైఎస్ఆర్సీపీ మైనార్టీ నాయకురాలు

రైల్వేకోడూరు పట్టణ పరిధిలోని స్థానిక పోలీస్ స్టేషన్ కి మరియు పోలీస్ సిబ్బందికి వాటర్ డిస్పెన్సరీ యంత్రాన్ని మరియు శానిటైజర్లను రైల్వేకోడూరు వైఎస్ఆర్సిపి మైనార్టీ మహిళా నాయకురాలు సయ్యద్ కరి ముని స్థానిక ఎస్సైలు పెద్ద ఓబన్న,రెడ్డి సురేష్ లకు అందజేయడం జరిగింది.ఈ సందర్భంగా మైనార్టీ మహిళా నాయకురాలు సయ్యద్ కరీముని మాట్లాడుతూ స్థానిక శాసన సభ్యులు మరియు ప్రభుత్వ చీఫ్ విప్ కొరముట్ల శ్రీనివాసులు ఆశీస్సులతో గురువారం స్థానిక పోలీస్ స్టేషన్ లో సిబ్బందికి మంచినీరు మరియు వేడి నీరు అందుబాటులో ఉండేందుకు వీలుగా మరియు ప్రజల యొక్క రక్షణ కొరకు,క్షేమం కొరకు అహర్నిశలు కంటి మీద కునుకు లేకుండా కష్టపడే పోలీసువారికి నా వంతు సాయంగా వాటర్ డిస్పెన్సరీ యంత్రాన్ని మరియు శానిటైజర్ లు, స్టీల్ వాటర్ బాటిల్స్ అందజేయడం నాకు ఎంతో సంతోషదాయకంగా ఉందని,అలాగే నన్ను ఎంతో ప్రోత్సహిస్తూ,ముందుకు నడిపిస్తున్న రైల్వేకోడూరు వైఎస్ఆర్సిపి నేతలకు ఈ సందర్భంగా సయ్యద్ కరిముని కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షుడు రామిరెడ