వైయస్ ఆర్ టీచర్స్ ఫెడరేషన్ కుటుంబ సంక్షేమ సహాయార్దం

ఇటీవల అకస్మాత్తుగా  గుండెపోటుతో మరణించిన  పొదిలి మండల ఉపాధ్యాయుడు  కీ.శే.అశోక్ రాజు   గారి కుటుంబానికి వైఎస్ఆర్ టీచర్స్ ఫెడరేషన్ ప్రాంతీయ కార్యాలయం పొదిలి నందు  ఏర్పాటుచేసిన సంతాపసభలో  రాష్ట్ర అధ్యక్షులు కె జాలిరెడ్డి గారు,జిల్లా అధ్యక్షులు జి.వెంకటేశ్వరరెడ్ది గారు హాజరై  కీ.శే.అశోక్ రాజు గారి చిత్ర పటానికీ పూలమాల వేసి నివాళులు అర్పించారు, ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు కె.జాలిరెడ్డి గారి చేతుల మీదుగా  వారి కుటుంబ సభ్యులకు 60,000/- రూ ఆర్థిక సహాయం అంద చేయటం జరిగినది, గత నెల18 న  స్వర్గస్ధులైన  సమయంలో కె. జాలిరెడ్డి గారు వెళ్లి వారి మృతికి సంతాపం తెలియజేయటం జరిగినది
  ఈ సందర్భంగా కె.జాలిరెడ్డి గారు మాట్లాడుతూ YSRTF కార్యకర్తలు  అనుకోకుండా మృతి చెందినప్పుడు ఇలాగే ఆర్దిక  సహాయం అందించటం జరుగుతుందని ఈ సందర్భంగా  తెలియజేశారు, ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి జగన్మోహన్ రెడ్డి,పొదిలి మండల అధ్యక్షులు రాంగోపాల్ రెడ్ది,ప్రదాన కార్యదర్శి Y.యోగిరెడ్డి,జిల్లా కార్యదర్శి శివారెడ్డి,మండల గౌరవ అధ్యక్షులు పెద్దిరాజు,శ్రీనివాసులు,సి.హెచ్ శ్రీనివాసరెడ్డి,మెర్సిన్ బాబు,మరియు ఉపాధ్యాయులు పాల్గోన్నారు