యువతీ, యువకులు చారిత్రక వ్యక్తుల జీవిత చరిత్రలను చదవాలి- ప్రధాని మోడీ
నేతాజీ సుభాష్ చంద్రబోస్ గౌరవార్థంగా పరాక్రమ్ దివస్ సందర్భంగా పార్లమెంటులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ యువతీ, యువకులతో ప్రత్యేకంగా సంభాషించారు. నో యువర్ లీడర్ కార్యక్రమానికి ఎంపికైన 81 మంది యువతీ, యువకులతో ప్రధాని మోడీ.. ఆయన నివాసంలో మాట్లాడి.. పలు విషయాలపై దిశానిర్దేశం చేశారు. యువతీ, యువకులతో జన సంరిపిభాషణలో.. నేతాజీ సుభాష్ చంద్రబోస్ జీవితంలోని వివిధ అంశాలను, ఆయన నుంచి మనం ఏమి నేర్చుకోవచ్చు అనే విషయాలను చర్చించారు. ఈ సందర్భంగా మోడీ యువతకు ఓ సలహా కూడా ఇచ్చారు. తమ జీవితంలో ఎలాంటి సవాళ్లను ఎదుర్కొన్నారో, ఆ సవాళ్లను ఎలా అధిగమించారో తెలుసుకోవడానికి చారిత్రక వ్యక్తుల జీవిత చరిత్రలను చదవాలని మోడీ సూచించారు. గొప్ప వ్యక్తుల జీవితంపై అవగాహనతో ఉండాలని సూచించారు. అదే సమయంలో, భిన్నత్వంలో ఏకత్వం అంటే ఏమిటో యువతీ, యువకులు ప్రధానికి చెప్పారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతిని.. కేంద్రం 2021 నుంచి పరాక్రమ్ దివస్ గా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అప్పటినుంచి పలు కార్యక్రమాలను నిర్వహిస్తుంది.