ప్రేమ విఫలమైందని యువతి ఆత్మహత్య…?

ప్రకాశం జిల్లా కొమరోలు మండలం బాదినేని పల్లి గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. బాదినేనిపల్లి గ్రామానికి చెందిన అంజలి(16) గ్రామ సమీపంలోని పులి వాగులో శవమై తేలింది. ఈనెల 14వ తేదీన నుండి అంజలి కనిపించడం లేదంటూ కుటుంబ సభ్యులు స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. అయితే ఈ రోజు తెల్లవారుజామున గ్రామ సమీపంలోని వాగులో అంజలి శవమై తేలడంతో కుటుంబ సభ్యులు ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యారు. అంజలి మృతి పై బోరున విలపిస్తూ గుండెలు బాదుకున్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న ఎస్సై సాంబ శివయ్య యువతి మృతదేహాన్ని వెలికి తీయించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. యువతి మృతికి గల కారణాలు ప్రేమ వ్యవహారం కూడా అయి ఉండొచ్చని ఎస్సై సాంబ శివయ్య తెలిపారు.