ఆంధ్రప్రదేశ్ లో మరో డాక్టర్ పై వైసీపీ నేతల వేధింపులు

ఆంధ్రప్రదేశ్ లో డాక్టర్ సుధాకర్ వ్యవహారం మరవక ముందే మరో వ్యవహారం వెలుగులోకి వచ్చింది.చిత్తూరు జిల్లా పెనమూరు ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న మహిళా డాక్టర్ అనితా రాణిని వైసీపీ నేతలు వేధిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి.దీంతో రాష్ట్రంలో దళితులను వైసీపీ నేతలు వేధిస్తున్నారని టీడీపీ విమర్శిస్తోంది. దళిత మహిళా డాక్టర్‌పై దారుణంగా ప్రవర్తించారని ఆ పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనితో డాక్టర్ అనితా రాణి వ్యవహారంపై దర్యాప్తు జరపాల్సిందిగా సీఎం జగన్ సీఐడీని ఆదేశించారు. ఉద్యోగుల అవినీతిని ప్రశ్నించినందుకు వైసీపీ నేతలు, పోలీసులు తనను వేధిస్తున్నారని డాక్టర్ అనితా రాణి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.