శ్రీ రాములు మృతి పార్టీకి తీరని లోటు వైసిపి నాయకులు విరుపాక్షి రెడ్డి

శ్రీరాములు కుటుంబానికి వైసీపీ అండగా ఉంటుంది మండల పరిధిలోని మిట్టసోమాపురం గ్రామ వైసీపీ నాయకులు శ్రీరాములు కుటుంబానికి ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డిగారు, నియోజకవర్గ ఇంచార్జి ఎర్రకోట జగన్మోహన్ రెడ్డి, వైసీపీ పార్టీ అండగా ఉంటుందని నియోజకవర్గ బిసి సెల్ అధ్యక్షులు, ముగతి గ్రామ సర్పంచు ముగతి విరుపాక్షిరెడ్డి అన్నారు. మంగళవారం శ్రీరాములు ఆకస్మిక మరణించారు.ముగతి విరుపాక్షిరెడ్డి ఆయన భౌతికకాయాన్ని సందర్శించి, పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ శ్రీరాములు మృతి పార్టీకి తీరని లోటు అన్ని తెలిపారు.మృతుని కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని ఆయన అన్నారు. వీరి వెంట ఆయా గ్రామ వైసీపీ నాయకులు పాల్గొన్నారు.