విప‌క్షాల రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థిగా య‌శ్వంత్ సిన్హా పేరు ఖరారు

రాష్ట్రపతి ఎన్నిక విషయంలో టీఆర్ఎస్ కీలక నిర్ణయం తీసుకుంది ..విప‌క్షాల రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థిగా య‌శ్వంత్ సిన్హా పేరు ఖరారు అయింది. పార్ల‌మెంట్ ఎన్ఎక్స్ భ‌వ‌న్‌లో స‌మావేశ‌మైన 18 ప్ర‌తిప‌క్షాల‌ పార్టీల నాయ‌కులు య‌శ్వంత్ సిన్హా పేరును ఏక‌గ్రీవంగా ప్ర‌తిపాదించారు. విప‌క్షాల నిర్ణ‌యాన్ని కాంగ్రెస్ నేత జైరాం ర‌మేశ్ ప్ర‌క‌టించారు. ఎన్‌సీపీ నేత శ‌ర‌ద్ ప‌వార్ నేతృత్వంలో ఈ సమావేశం జ‌రిగింది. అన్ని పార్టీలు త‌న‌కు మ‌ద్ద‌తు ఇవ్వాల‌ని య‌శ్వంత్ సిన్హా విజ్ఞ‌ప్తి చేశారు. య‌శ్వంత్ సిన్హా గ‌తంలో కేంద్ర ఆర్థిక‌, విదేశాంగ శాఖ‌ల మంత్రిగా ప‌ని చేశారు.ప్ర‌స్తుతం తృణ‌మూల్ పార్టీలో కొన‌సాగుతున్న య‌శ్వంత్ సిన్హా.. ఇవాళ ఉద‌యం ఆ పార్టీకి రాజీనామా చేశారు. విప‌క్ష పార్టీల త‌ర‌పున రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థిని ఎంపిక చేసేందుకు ఇటీవ‌ల బెంగాల్ సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ ఢిల్లీలో సమావేశం ఏర్పాటు చేసిన విష‌యం తెలిసిందే. పార్ల‌మెంట‌రీ బోర్డు మీటింగ్‌కు ప్ర‌ధాని మోదీ వ‌ర్చువ‌ల్‌గా హాజ‌రుకానున్నారు. బీజేపీయేతర అభ్యర్థికి మద్దతు ఇచ్చేందుకు కేసీఆర్ ఒకే చెప్పారు. మాజీ కేంద్రమంత్రి యశ్వంత్ సిన్హాకు గులాబీ పార్టీ మద్దతు ప్రకటించింది.