ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ విషయంలో కీలక నిర్ణయం తీసుకున్న ఐసిసి.

ఇంగ్లండ్ వేదికగా టీమిండియా న్యూజిలాండ్ జట్ల మధ్య త్వరలో జరగబోయే ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌ షిప్ ఫైనల్ విషయంలో అంతర్జాతీయ క్రికెట్​ మండలి కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మ్యాచ్ డ్రా అయినా లేదంటే టై అయిన పక్షంలో న్యూజిలాండ్, టీమిండియాలను సంయుక్త విజేతలుగా ప్రకటించాలని నిర్ణయించుకుంది. ఈ మేరకు ఐసీసీ వెబ్​సైట్​లో ప్రకటించింది. ఆట పరిస్థితుల​ ఆధారంగా మ్యాచ్​ డ్రాగా ముగిసినా, లేదంటే టై అయినా కూడా రెండు టీమ్​లను జాయింట్ విన్నర్స్​గా ప్రకటిస్తామని ఐసీసీ గ్లోబల్ బాడీ తెలిపింది. అంతేకాదు రిజర్వ్​డే నిబంధనను పక్కన పెట్టేస్తున్నట్లు తెలిపింది. అయితే ఈ రెండు నిర్ణయాలు ఇప్పటికిప్పుడు తీసుకున్నవి కాదని, వరల్డ్ టెస్ట్​ ఛాంపియన్​షిప్​ ప్రకటన కంటే ముందు జూన్​ 2018లోనే తీసుకున్న నిర్ణయాలేనని ఐసీసీ తెలిపింది.