కొండగట్టు అంజన్న సన్నిధిలో వారాహికి పూజలు

కళ్యాణ్ కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో వారాహి ప్రచార రథానికి శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. పవన్ కళ్యాణ్ కి ఆలయ అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. స్వామివారి దర్శన అనంతరం పార్టీ ప్రచార రథం వారాహికి వేద పండితుల మంత్రోచ్ఛా రణల మధ్య జనసేనాని శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు జరిపించారు. పవన్ కళ్యాణ్ తో వారాహి వాహనానికి ప్రత్యేక పూజలు దగ్గరుండి చేయించిన వేద పండితులు వాహనం ఎదుట సంకల్పసిద్ధి చేయించారు. వారాహి వాహనానికి పండితులు ప్రత్యేకంగా స్వామివారి యంత్రాన్ని కట్టి, సింధూరంతో శ్రీరామదూత్ అని రాశారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజలు అనంతరం విఘ్నాలు తొలగిపోయేలా, విజయాలు సిద్ధించేలా గుమ్మడికాయ కొట్టి వారాహిని ప్రారంభించారు. అనంతరం వేద పండితుల ఆశీర్వచనం అందుకున్నారు పవన్ కళ్యాణ్. అనంతరం జనసేనాని ప్రారంభసూచకంగా వారాహి ఎక్కి వాహనాన్ని పరిశీలించారు. వారాహి ప్రారంభించిన అనంతరం నాచుపల్లి సమీపంలోని కోడీమ్యాల మండలం పరిధిలోని బృందావన్ రిసార్ట్‌లో తెలంగాణ జనసేన నేతలతో సమావేశం కానున్నారు.