హాస్టల్ యాజమాన్యం వేధింపులతో డిగ్రీ విద్యార్థిని బలి

హాస్టల్ యాజమాన్యం వేధింపులతో డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. వికారాబాద్ జిల్లా… షాద్‌నగర్‌కు చెందిన ఐశ్వర్య…ఢిల్లీలో డిగ్రీ చదువుతోంది. కరోనా కారణంగా…బలవంతంగా హాస్టల్ ఖాళీ చేయించింది యాజమాన్యం. దాంతో స్వగ్రామానికి వచ్చిన ఐశ్వర్య…ఇంట్లో ఉరేసుకొని చనిపోయింది. కాలేజీ యాజమాన్యం వేధింపులే కారణమని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. షాద్‌ నగర్‌  శ్రీనివాస కాలనీకి చెందిన శ్రీనివాస్‌రెడ్డి, సుమతి దంపతులకు ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తె ఐశ్వర్యా రెడ్డి ఢిల్లీ యూనివర్సిటీ పరిధిలోని లేడీ శ్రీరామ్ కళాశాలలో బీఎస్సీ సెకండియర్‌ చదువుతోంది. కొవిడ్ నేపథ్యంలో తాజాగా ఇంటికి వచ్చింది. ఈ నెల 3నే ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. నిన్న కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం షాద్‌నగర్‌ హాస్పిటల్ కు తరలించారు.