న్యాయం కొరకు మహిళ ఆత్మహత్యాయత్నం.

ఆడపిల్ల పుట్టడమే నేరమా? నెలలు నిండకుండా పుట్టిన బిడ్డ మూడు రోజులకే చనిపోతే భర్తనుండి దూరం కావలసిందేనా?? నాలుగు రోజుల క్రితం పురుగులమందు త్రాగి ఆత్మహత్యాయత్నం చేసుకున్న మహిళ ఉదంతం ఆలస్యంగా వెలుగుచూసింది. భర్తతోనే కలసి జీవించాలని, తన భర్తకు కౌన్సిలింగ్ ఇచ్చి తన తో కలసి జీవించేలా చేయాలని మహిళ కొద్దిరోజుల క్రితం పిర్యాదు. మచిలీపట్నం కు చెందిన గంపల భిందు మాధవి కి ఎక్కడకు వెళ్ళినా తనకు చేదు అనుభవమే ఎదురవుతుందని, తనకు న్యాయం జరగడం లేదని భావించిన మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు బాదితురాలి అక్క ఆవేదన. ముందుగా పెద్దలను ఆశ్రయించగా నీభర్త ససేమిరా నీతో కాపురం చేయడానికి ఇష్టపడటం లేదు కొంత డబ్బు ఇస్తాడు అవి తీసుకుని అతనికి విడాకులు ఇస్తే తానూ ఇంకో పెళ్లి చేసుకుంటాడు అని పెద్దలు సలహా ఇవ్వడంతో పోలీసులను ఆశ్రయించిన మహిళ. పురుగుల మందు త్రాగిన ప్రాణాలతో బయటపడిన మహిళను ఈరోజు ICU నుండి జనరల్ వార్డు కు తరలించడంతో తన ఆవేదనను మీడియాతో పంచుకుంది.