శింబు త్రిష లు మళ్లీ ఒక్కటవ్వనున్నారా..?

త్రిష – శింబు వీరిద్దరూ పెళ్లి చేసుకుంటారు అని ఇంతకు ముందు మీడియా సైతం పలు కథనాలు రాసింది.అంతలోనే త్రిష ఒక వ్యాపారవేత్త తో నిశ్చితార్థం చేసుకోవడంతో ఈ వార్తలకు బ్రేక్ పడింది.అయితే ఇప్పుడు మరొకసారి ఈ అంశం తెరపైకి వచ్చింది.లాక్ డౌన్ సమయం లో శింబు మరియు త్రిష మరొకసారి కార్తీక్ డయల్ సేతా యేన్ అనే ఒక షార్ట్ ఫిల్మ్ కోసం కలిసి పని చేశారు.అయితే ఈ ఏడాది చివరన డిసెంబర్ లో శింబు ఒక శుభవార్త చెబుతా అంటూ ప్రకటనను ఇచ్చారు. అయితే ఇది పెళ్లి గురించి అయి ఉంటుంది అని అందరూ భావిస్తున్నారు.త్రిష తన నిశ్చితార్దాన్ని రద్దు చేసుకోగా శింబు పలు పలువురు హీరోయిన్ల తో లవ్ ట్రాక్ నడిపి ప్రస్తుతం కాలిగా ఉన్నాడు. అంతేకాక తమిళ నిర్మాతల మండలి లో శింబు తండ్రి రాజేంద్ర పోటీ చేయనున్నారు. ఈ మేరకు ఒక విలేకరి శింబు త్రిష ల వివాహం గురించి అడగగా, ప్రశ్న ను దాటవేశారు. మరి శింబు చెబుతా అన్న ఆ శుభవార్త ఏమై ఉంటుందో చూడాలి.