జనసేన పార్టీ అంటే జగన్ రెడ్డికి ఎందుకింద భయం : జనసేన పార్టీ శ్రీకాళహస్తి నియోజకవర్గ ఇన్చార్జి వినుత కోటా

జనసేన నాయకులను కట్టడి చేయడానికి మాత్రమే పోలీసులను ఉపయోగిస్తారా?

ప్రజా సమస్యలు కూడా వినడానికి జగన్ రెడ్డి కి ఇష్టం లేదా?

శ్రీకాళహస్తి నియోజకవర్గం లోని ప్రజా సమస్యలపై వినతి ఇవ్వడానికి వెళుతున్న జనసేన పార్టీ శ్రీకాళహస్తి నియోజకవర్గ ఇన్చార్జ  వినుత కోటా ని , జనసైనికులను అక్రమంగా నోటీసులు ఇచ్చి, హౌస్ అరెస్ట్ చెయ్యడం జరిగింది. ఈ సందర్భంగా వినుత గారు మీడియాతో మాట్లాడుతూ హౌస్ అరెస్ట్ను ఖండిచడం జరిగింది. ముఖ్యమంత్రి గారు తాడేపల్లి పాలస్ లో మాత్రమే ఉంటారు ప్రజలను కలవారు మరి నియోజకవర్గాలకు వచ్చినపుడు ప్రజా సమస్యలు కూడా వినడానికి ఇష్టం లేదు, జన సేనపార్టీ ని అరెస్టులు చెయ్యడం ఏంటని ప్రశ్నించారు. డీజీపీ గారు మా పవన్ కళ్యాణ్ గారికి అప్పాయింట్మెంట్ ఇవ్వరు, స్థానిక అధికారులు ప్రజా సమస్యలపై కలెక్టర్ గారు కూడా స్పందించరు, ఇక ప్రజల సమస్యలు ఎవరికీ చెప్పాలని డిమాండ్ చేశారు. పోలీసులను అడ్డు పెట్టుకుని జనసేన ను ఆపలేరని తెలిపారు. జగన్ రెడ్డి ఇచ్చిన హామీలు నెరవేర్చడం పై ముఖ్యంగా జాబ్ క్యాలెండర్, సంపూర్ణ మధ్యపాన నిషేధం, నియోజక వర్గంలో మౌలిక వసతుల కల్పన పై విఫలం అయిన విషయాలను తెలియజేయాలను కుంటే ఆపడం ఆయన పిరికితనానికి నిదర్శనం అని తెలిపారు.