రైతుల సంక్షేమమే ముఖ్యమంత్రి లక్ష్యం : ఎంపీపీ

కృష్ణాజిల్లా నందిగామ: రైతుల సంక్షేమమే ధ్యేయంగా ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలన కొనసాగిస్తున్నారని ఎంపీపీ కోటేరు లక్ష్మి పేర్కొన్నారు. మండల కేంద్రమైన వీరులపాడు గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద యంత్ర సేవా కేంద్రం ద్వారాసబ్సిడీకి రైతులకు అందించే ట్రాక్టర్ల ను ( సోలిస్ యన్మర్) కంపెనీ ప్రతినిధులతో రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమానికి అనేక చర్యలు తీసుకుంటుదన్నారు. రైతు భరోసా కేంద్రం లో 5గురు రైతులు కలిసిగ్రూపుగా ఏర్పడి ట్రాక్టర్ కోసం దరఖాస్తు చేసుకుంటే ఒక్కొక్క గ్రూపుకు 15 లక్షలు వరకు 40 శాతం సబ్సిడీతో వారికి టాక్టర్ అందజేయడం జరుగుతుందన్నారు. మండల పరిధిలో మొత్తం 15 ఆర్బీ కే కేంద్రాలు ఉన్నాయని ఒక్కో ఆర్.బికే కేంద్రానికి రెండు ట్రాక్టర్ చొప్పున అందజేయడం జరుగుతుందన్నారు. ఇలాంటి అవకాశాన్ని రైతుల సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ సభ్యులు కోటేరు ముత్తా రెడ్డి, వైస్ ఎంపీపీ వేమూరి అదాం, వ్యవసాయ శాఖ అధికారి పద్మ , ఎంపీటీసీ సభ్యులు ఇప్పల సత్యనారాయణ రెడ్డి,తోటనొరయణ రావు, వైయస్సార్ సిపి నాయకులు అయిలూరి నర్సిరెడ్డి, కోట సంగయ్య, మటూరి సాయిబాబు, కంపెనీ ప్రతినిధులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.