ఐదో టెస్టును రీషెడ్యూల్‌ చేస్తాం : గంగూలీ

టీమిండియా, ఇంగ్లండ్‌ జట్ల మధ్య రద్దయిన ఐదో టెస్టు వ్యవహారం ఐసీసీ వరకు చేరింది. ఐదవ టెస్ట్ నిర్వహణపై ఐసీసీ ఎలాంటి నిర్ణయం తీసుకోనుందనేది.. ఇప్పుడు ఆశక్తికరంగా మారింది. కాగా ఐదో టెస్ట్ నిర్వహిస్తే అది మరో సిరీస్ అవుతుందని ఇంగ్లండ్ పేర్కొంది. ఈ నేపథ్యంలో బీసీసీఐ స్పందించింది. ఇంగ్లండ్‌తో ఐదు టెస్టుల సిరీస్‌లో రద్దయిన ఆఖరి మ్యాచ్‌ను రీషెడ్యూల్‌ చేస్తామని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ తెలిపారు. దీన్ని మరో సిరీస్‌గా (ఏకైక టెస్టు) అనుమతించబోమని ఆయన స్పష్టం చేశారు. ఈ సుదీర్ఘ సిరీస్‌ను బీమా చేసిన ఇంగ్లండ్‌ క్రికెట్‌ బోర్డు (ఈసీబీ) వివాద పరిష్కారానికి ఐసీసీ తలుపు తట్టింది. దీన్ని నిశితంగా గమనించిన బీసీసీఐ అసంపూర్తి సిరీస్‌ను పూర్తి చేసేందుకు సిద్ధమని తెలిపింది.