ఆర్‌బి చౌదరిపై పోలీసులకు పిర్యాదు చేసిన విశాల్.

ప్రముఖ తమిళ హీరో విశాల్ సీనియర్ నిర్మాత ఆర్‌బి చౌదరి పై పోలీస్ కేస్ పెట్టడం తమిళ నాట సంచలనంగా మారింది. 2018లో విడుదలైన అభిమన్యుడు చిత్రం కోసం విశాల్ సీనియర్ నిర్మాత ఆర్‌బి చౌదరి వద్ద తనకు సంబంధించిన కొన్ని డాక్యూమెంట్లు పెట్టి కొంతమొత్తం అప్పుగా తీసుకున్నారు. తరువాత అప్పు మొత్తాన్ని తిరిగి చెల్లించినప్పటికీ తనకు సంబంధించిన చెక్ లు, బాండ్లు, ప్రామిసరీ నోట్లను తిరిగి ఇవ్వడం లేదని విశాల్ పోలీసులను ఆశ్రయించాడు. దీనిపై ఆర్‌బి చౌదరి ఇంకా స్పందించలేదు.