ముఖ్యమంత్రి సహాయనిధికి గ్రామ సర్పంచ్ లక్ష రూపాయల విరాళం

కాకినాడ : వరద బాధితుల సహాయార్థం రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి కాకినాడ రూరల్ వైసీపీ సీనియర్ నాయకుడు, తిమ్మాపురం గ్రామ సర్పంచ్ బెజవాడ సత్యనారాయణ గురువారం పాయకరావుపేటలో ఒక ప్రైవేట్ ఫంక్షన్ కి హాజరైన ముఖ్యమంత్రి ని మర్యాదపూర్వకంగా కలిసి దుస్సాలువ కప్పి వరద బాధితుల సహాయార్థం మాజీ మంత్రి, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే, జిల్లా వైకాపా అధ్యక్షుడు కురసాల కన్నబాబు సమక్షంలో చెక్కును విరాళంగా అందజేశారు. అనంతరం సీఎం జగన్ బెజవాడ సత్యనారాయణ ఔదార్యాన్ని ప్రత్యేకంగా అభినందించారు.