మాస్ మహారాజా రవితేజకు విక్టరి వెంకటేష్ సాయం

మాస్ మహారాజా రవితేజ ‘క్రాక్’ అనే కొత్త చిత్రంతో రాబోతోన్న సంగతి తెలిసిందే. దాదాపు అన్ని పనులు పూర్తిచేసుకున్న ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించిన ఈ మాస్ యాక్షన్ సంక్రాతి కానుకగా జనవరి 14న విడుదలకానుంది. రవితేజ పోలీస్ పాత్రలో కనిపించనున్న ఈ సినిమాపై ప్రేక్షక వర్గాల్లో మంచి అంచనాలున్నాయి. ఇక కాంబినేషన్‌లో గతంలో ‘బలుపు, డాన్ శీను’ లాంటి మాస్ ఎంటెర్టైనర్లు వచ్చి.. అదరగొట్టడడంతో ఈ సారి కూడా అదే మ్యాజిక్ రిపీట్ అవుతుందని భావిస్తున్నారు రవితేజ అభిమానులు. ఇక అది అలా ఉంటే ఈ చిత్రానికి విక్టరీ వెంకటేష్ వాయిస్ ఓవర్ ఇవ్వనున్నారు. వెంకి మాట సాయం ఖచ్చితంగా ఈ సినిమాకు అదనపు ఆకర్షణగా నిలుస్తుందని అంటున్నారు. విడుదల దగ్గరపడుతుండడంతో ఈ సినిమా ట్రైలర్ ఈరోజు అనగా జనవరి ఒకటిన కొత్త సంవత్సరం సందర్బంగా విడుదలకానుంది. ఈ సినిమాలో రవితేజ సరసన అందాల తార శృతిహాస‌న్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇతర ముఖ్య పాత్రల్లో సముద్ర ఖని, వరలక్ష్మి శరత్ కుమార్ నటించారు. బి.మధు నిర్మించిన ఈ చిత్రానికి తమన్ సంగీతం అందించాడు. ఇప్పటికే విడుదలైన పాటలు కూడ మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి ఇక మాస్ మహారాజా రవితేజ.. గత సినిమాల విషయానికి వస్తే.. అనిల్ రావిపూడి దర్శకత్వంలో, దిల్ రాజు నిర్మాణంలో వచ్చిన రాజా ది గ్రేట్ సినిమా తర్వాత ఆయన ఇప్పటి వరకు మంచి హిట్ పడలేదు. ఆయన నుంచి తాజాగా వచ్చిన ‘డిస్కో రాజా’ సినిమా కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. వరుస ప్లాపులతో సతమతమవుతోన్న రవితేజ ప్రస్తుతం ‘క్రాక్’ అనే సినిమా చేస్తున్నాడు.

అయితే రవితేజ ఈ సినిమాపై ఫుల్ కాన్పిడెన్స్‌తో ఉన్నాడు. ‘క్రాక్’ సినిమా రవితేజకు పూర్వవైభవాన్ని తీసుకొస్తోందట. ఈ చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేయనున్నారు. జనవరి 14న ఈ సినిమా విడుదలకానుందని సమాచారం. అయితే ఇప్పటికే సంక్రాంతి బరిలో పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్, బెల్లంకొండ అల్లుడు అదుర్స్ ఉన్నాయి. రవితేజ ‘డిస్కో రాజా’తో ఆశించిన స్థాయిలో హిట్ అందుకోలేకపోయాడు. మరి క్రాక్ సినిమాతోనైనా అందుకుంటాడేమో చూడాలి. ప్రస్తుతం క్రాక్ సినిమాకు సంబంధించిన డబ్బింగ్ పనులు జరుగుతున్నాయి.