వర్ల దంపతుల 12 గంటల నిరసన దీక్ష

తెలుగుదేశం అధినేత చంద్రబాబు సతీమణి భువనేశ్వరిపై శాసనసభలో చేసిన వ్యాఖ్యలను వైకాపా ప్రభుత్వం వెంటనే వెనక్కు తీసుకోవాలని ఆ పార్టీ సీనియర్‌ నేత వర్ల రామయ్య డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన చట్టసభల్లో వ్యక్తిగత దూషణలు ఏంటని ఆయన మండిపడ్డారు. ముఖ్యమంత్రి జగన్‌ సభలో చేసిన విమర్శలపై క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. విజయవాడలోని తన స్వగృహంలో నారా దంపతులకు వర్ల దంపతుల మద్దతు అనే నినాదంతో 12గంటల పాటు ఆయన నిరసన దీక్ష చేపట్టారు.