జస్టిస్ ఎన్వీ రమణకు కేంద్ర న్యాయశాఖ మంత్రి లేఖ.

సుప్రీం ప్రధాన న్యాయమూర్తి  జస్టిస్ ఎన్వీ రమణ ఈ నెల 26న పదవీ విరమణ చేయనున్నారు. ఆయన స్థానంలో కొత్త వారికి బాధ్యతలు అప్పగించే అంశం పైన కేంద్రం ప్రస్తుత సీజేఐ ఎన్వీ రమణ నుంచి అభిప్రాయం కోరింది. కేంద్ర న్యాయశాఖ మంత్రి ఈ మేరకు సిఫార్సు కోరుతూ లేఖ రాసారు. దీని పైన సుప్రీం కోర్టు కొలీజియం సమావేశమైంది. ప్రధాన న్యాయమూర్తితో పాటుగా ఖాళీగా ఉన్న న్యాయమూర్తుల భర్తీ పైన చర్చించింది. ట్రిపుల్‌ తలాక్‌ విధానంలో విడాకులు చెల్లుబాటు కావని, రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంటూ 2017లో 3-2 మెజారిటీతో తీర్పు వెలువరించిన ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనంలో జస్టిస్‌ లలిత్ సభ్యుడిగా ఉన్నారు. కేరళలోని శ్రీ పద్మనాభస్వామి ఆలయం నిర్వహణ హక్కు అప్పటి రాజకుటుంబా నికి ఉంటుందని జస్టిస్‌ లలిత్‌ నేతృత్వంలోని ధర్మాసనం రూలింగ్‌ ఇచ్చింది. పలు కీలక తీర్పుల్లో భాగస్వామి గా వ్యవహరించిన జస్టిస్ లలిత్..నియామకం అధికారికమైతే ఆయన మూడు నెలల పాటు ఆ హోదాలో పని చేయనున్నారు. లలిత్ నవంబర్ 8వ తేదీన పదవీ విరమణ చేయనున్నారు.సీజేఐ గా ఎన్వీ రమణ స్థానంలో తదుపరి సీజేఐగా సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తి జస్టిస్‌ యు.యు.లలిత్‌ నియామకం దాదాపు ఖరారైంది. ఈ నెల 27న సుప్రీం 49వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ లలిత్ బాధ్యతలు చేపట్టనున్నారు.