సామర్లకోటలో అర్ధరాత్రి లారీ భీబత్సం ఇద్దరు పోలీసులు మృతి.

తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట మండలం ఉండూరు వద్ద అర్ధరాతి 2 గంటల సమయంలో లారీ భీబత్సం సృష్టించింది. అదే సమయంలో విజయవాడ నుంచి వస్తున్న కరోనా వ్యాక్సిన్‌ వాహనానికి ఎస్కార్ట్‌గా వెళ్ళిన కాకినాడ తిమ్మాపురం పోలీస్‌స్టేషన్‌లో విధులు నిర్వర్తిస్తున్న హెడ్‌ కానిస్టేబుల్‌ సత్యనారాయణ, హోంగార్డు ఎన్‌ఎస్‌రెడ్డి లపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.