సౌత్ స్టార్ డైరెక్టర్ శంకర్ నుంచి రెండు భారీ పాన్ ఇండియన్ చిత్రాలు

 సౌత్ స్టార్ డైరెక్టర్ శంకర్  ప్రస్తుతం మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తో ఓ భారీ పాన్ ఇండియా సినిమాను రూపొందిస్తున్న విషయం తెలిసిందే . ఇండియన్ – 2  సినిమా చిత్రీకరణ సమయంలోనే ఆగిపోయింది. దాంతో తెలుగులో మొదటిసారి చేస్తున్న స్ట్రైట్ మూవీ ఆర్సీ 15 తో భారీ హిట్ కొట్టాలని కసిగా ఉన్నారు. మధ్యలో ఈ సినిమాను ప్రముఖ నిర్మాత దిల్ రాజు  దాదాపు 200 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. రోబో తర్వాత శంకర్ నుంచి వచ్చిన ఐ, రోబో 2.ఓ ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయాయి. కమల్ హాసన్‌ తో చేస్తున్న ఇండియన్ 2 ప్రాజెక్ట్ మళ్ళీ సెట్స్ మీదకు తీసుకువచ్చే ప్రయత్నాలు . ఈ సినిమా చాలా నెలలుగా ఆగిన సంగతి తెలిసిందే. ఈ డిసెంబర్ నుంచి ఇండియన్ 2 మిగిలిన చిత్రీకరణ మొదలవనుందని వార్తలు వచ్చాయి. కానీ, ఇప్పుడు వస్తున్న వార్తల ప్రకారం సెప్టెంబర్ నుంచి ఒకవైపు ఆర్సీ 15 చేస్తూనే మరో వైపు ఇండియన్ 2 షూటింగ్ కూడా కంప్లీట్ చేయనున్నారట. నెలలో సగం రోజులు ఓ సినిమా, మిగతా సగం రోజులు మరో సినిమా చిత్రీకరణ పూర్తి చేసేందుకు శంకర్ ప్లాన్ చేస్తున్నారట. అలా గనక కంప్లీట్ అయితే రెండు భారీ పాన్ ఇండియన్ చిత్రాలు శంకర్ నుంచి రావడం గ్యారెంటీ.