ఎట్టకేలకు గండికోట బ్యాక్ వాటర్‌లో గల్లంతైన ఇద్దరి మృతదేహాల వెలికితీత

కడప : ఎస్పీ ఆదేశాల మేరకు అదనపు ఎస్పీ (ఆపరేషన్స్ ) ఎం. దేవ ప్రసాద్ ఆధ్వర్యంలో శనివారం ఉదయం 15 తెప్పలు, రెస్క్యూ బోటు, గజ ఈతగాళ్లతో జల్లెడ పట్టిన పోలీసులు, గ్రామస్తులు. మూడు రోజుల నుండి రేయింబవళ్ళు ప్రతికూల వాతావరణం లోనూ పోలీసుల రెస్క్యూ ఆపరేషన్..ఓ వైపు నదిలో ఎదురుగాలి వీస్తున్నా శ్రమించి గాలింపు కొనసాగించిన పోలీసు, అగ్నిమాపక సిబ్బంది..
గ్రామంలో అందరితో కలిసిమెలిసి ఉండే వ్యక్తులు తెప్ప ప్రమాదంలో గల్లంతవడంతో స్వచ్ఛందంగా పెద్ద ఎత్తున తరలి వచ్చి గాలింపు చర్యల్లో పోలీసులకు సంపూర్ణ సహకారం అందించిన గ్రామస్తులు.. మృతదేహలను చూసి కన్నీరు మున్నీరైన తాళ్ల ప్రొద్దుటూరు గ్రామస్తులు. ఘటన జరిగిన ప్రదేశం నుండి 500 మీటర్ల దూరంలో లభ్యమైన గోవర్ధన్ రెడ్డి(29) సుహాసిని(32) ల మృత దేహాలు. మూడు రోజుల క్రితం కొండాపురం మండలం తాళ్ల పొద్దుటూరు గ్రామం గండికోట బ్యాక్ వాటర్‌లో తెప్ప తిరగబడి ముగ్గురు గల్లంతు ఘటన. గల్లంతైన వారిలో ఒకరు సురక్షితంగా బయట పడ్డారు. మృతులను సుహాసిని(32), గోవర్ధన్ రెడ్డి(29) గా గుర్తింపు. పోలీసుల కృషిని అభినందించిన గ్రామస్తులు..