గాంధీ ఆసుపత్రిలో డాక్టర్లపై దాడి ఘటనలో ఇద్దరు అరెస్ట్

గాంధీ ఆస్పత్రిలో జూనియర్ డాక్టర్లపై రోగి బంధువులు దాడి చేయడంతో డాక్టర్లు ఆందోళన చేపట్టిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై విచారణ చేపట్టిన పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేశారు. వైద్య సిబ్బందిపై దాడులకు పాల్పడితే చట్ట పరంగా కఠిన చర్యలు తీసుకుంటామని నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ తెలిపారు. కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో వైద్యులు అగ్రభాగాన నిలిచి పోరాడుతున్నారని గుర్తుచేశారు.