అధ్యక్షుడిగా తన ఆఖరి ప్రసంగంలో కొత్త ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలిపిన ట్రంప్..

అమెరికా 45 అధ్యక్షుడు ట్రంప్ అధక్షుడిగా తన చివరి ప్రసంగం చేశారు. రాబోయే కొత్త ప్రభుత్వానికి శుభాకాంక్షలు చెప్పారు. పాలన సజావుగా సాగాలని, కొత్త ప్రభుత్వం అమెరికాను అభ్యున్నతికి పాటుపడాలని కోరుకుంటున్నట్టు ట్రంప్ పేర్కొన్నారు. ప్రజల్లో అమెరికా పట్ల భక్తి భావం తగ్గిపోతొందని, దానిని తిరిగి నిలబెట్టాలని ట్రంప్ పేర్కొన్నారు. బయటి శక్తుల నుంచి ముప్పు ఉందని, అమెరికా బలమైన దేశంగా ఎదిగిన సమయంలో వాటిని సమర్ధవంతంగా ఎదుర్కోవాలని ట్రంప్ కోరారు. జనవరి 6 వ తేదీన క్యాపిటల్ భవనంపై జరిగిన దాడిని ట్రంప్ ఖండించారు. ఇలాంటి చర్యలను సహించేది లేదని పేర్కొన్నారు. అయితే, తన ప్రసంగంలో ట్రంప్ ఎక్కడా కూడా బైడెన్ యొక్క గెలుపు గురించి ప్రస్తావించలేదు. ప్రజలు తనకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నానని, అమెరికాను అన్ని విధాలుగా అగ్రస్థానంలో నిలిపేందుకు తనవంతు ప్రయత్నం చేసానని ట్రంప్ పేర్కొన్నారు.