వరద బాధితుల ఖాతాల్లో నగదు జమ కావడంతో హర్షం వ్యక్తం చేసిన టిఆర్ఎస్ నాయకులు

భద్రాచలం నియోజకవర్గం వరద ముంపు ప్రాంతాల పర్యటనలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు బాధితులకు ఇచ్చిన హామీ మేరకు పదివేల రూపాయలు, 25 కేజీల బియ్యం, ఐదు కేజీల కందిపప్పును ప్రభుత్వం తరఫున అందజేశారు. కాగా నిన్న బాధితుల ఖాతాల్లో నగదు జమ కావడంతో భద్రాచలం నియోజకవర్గపు పార్టీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు.