కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన మంత్రి సత్యవతి రాథోడ్‌.

ములుగును మోడల్ ప్రొఫైల్ హెల్త్ కేర్ మోడల్ జిల్లాగా ఎంపిక చేయడం సంతోషంగా ఉందని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ అన్నారు. ఈ సందర్బంగా ములుగులోని గట్టమ్మ దేవాలయ ఆవరణలో మహబూబాబాద్‌ ఎంపీ మాలోత్‌ కవితతో కలిసి ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం మంత్రి సత్యవతి రాథోడ్‌ మాట్లాడుతూ.. ములుగు జిల్లా అంటే సీఎం కేసీఆర్‌కు ఎంతో ప్రేమ ఉందన్నారు. జిల్లా వాసులందరి తరపున ముఖ్యమంత్రి కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలుపుతున్నామని.. ములుగు జిల్లా అభివృద్ధి కోసం ఎన్నో నిధులు కేటాయిస్తున్నారని తెలిపారు.