బెంగళూరు సమీపంలోని రైల్వే ట్రాక్‌ పై సింగర్ హరిణి తండ్రి మృతదేహం

టాలీవుడ్ సింగర్ హరిణి తండ్రి మృతి చెందారు. హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలో ఆమె కుటుంబ సభ్యులు నివసిస్తున్నారు. గత వారం రోజులుగా ఆ ఫ్యామిలీ మొత్తం మిస్సైపోయింది. ఇదంతా మిస్టరీగా ఉందని అందరూ చర్చించుంటున్న సమయంలో అనూహ్యంగా బెంగళూరు సమీపంలోని రైల్వే ట్రాక్‌పై హరిణి తండ్రి ఏకే రావు శవంగా కనిపించారు. ఆయన ఆత్మహత్య చేసుకున్నట్టు సమాచారం. అయితే, ఇప్పటి వరకూ ఎక్కడున్నారో తెలియని హరిణి ఫ్యామిలీ అంతా ఇప్పుడు బెంగళూరు రైల్వే పోలీస్ స్టేషన్‌కు రావడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ప్రస్తుతం ఏకే రావు మృతిపై పోలీసులు దర్యాప్తు సాగిస్తున్నారు