ఆ ఆరోపణల్లో నిజం లేదు: ఫాతిమా సనా షేక్

బాలీవుడ్‌ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్‌ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.  సినిమాల పరంగా ఎలా ఉన్నా.. వ్యక్తిగతంగా ఎక్కువగా వివాదాలతోనే ఉంటాడు అమీర్ ఖాన్.ఇప్పుడు కూడా ఇదే జరుగుతుంది. ఈయన మూడో పెళ్లి చేసుకోబోతున్నాడంటూ సోషల్ మీడియాలో జోరుగా వార్తలు వస్తున్నాయి. కిరణ్ రావుతో 15 ఏళ్ళ వైవాహిక జీవితానికి ఈ మధ్యే ముగింపు పలికాడు అమీర్ ఖాన్. కిరణ్‌ రావుతో విడిపోయిన తర్వాత సినిమాలతో బిజీగా ఉన్నాడు ఈయన. అయితే తాజాగా అమీర్ మూడో పెళ్లి చేసుకుంటున్నట్లు వార్తలు బాగానే వస్తున్నాయి. లాల్‌ సింగ్‌ చద్దా’ చిత్రం విడుదలయ్యాక తన మూడో పెళ్లికి సంబంధించిన విషయాన్ని ప్రకటిస్తారని బాలీవుడ్‌లో చర్చ జరుగుతుంది. ఈ పుకార్లలో ఎలాంటి నిజం లేదని అమీర్ ఖాన్ సన్నిహితులు చెప్తున్నారు. కావాలనే అమీర్ ఖాన్ పేరును ఇలా చెడ అమీర్ ఖాన్‌, కిరణ్‌ రావు మధ్య విభేదాలకు.. మనస్పర్థలకు కారణం దంగల్ హీరోయిన్ ఫాతిమా సనా షేక్‌ అనే టాక్ చాలా రోజులుగా వస్తుంది. ఈమె కారణంగానే అమీర్ కాపురంలో కలతలు రేగాయనే ప్రచారం జరుగుతుంది. తాజాగా దీనిపై ఫాతిమా సనా షేక్‌ కూడా స్పందించింది. అలాంటిదేం లేదని.. తన వల్లే అమీర్ ఖాన్ కుటుంబంలో గొడవలు వచ్చాయని చెప్పడం పూర్తిగా అబద్ధం అంటుంది ఫాతిమా.గొడుతున్నారంటూ వాళ్లు ఆరోపిస్తున్నారు. అమీర్ ఖాన్‌ ప్రస్తుతం తన సినిమాల్లో బిజీగా ఉన్నాడని తెలిపారు. దీనిపై ఓ టీవీ ఇంటర్వ్యూలో ఈమె స్పందించారు. కొందరు వ్యక్తులు కావాలనే అమీర్ ఖాన్‌, తాను డేటింగ్‌లో ఉన్నట్లు దుష్ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. తమ ఇద్దరి ప్రతిష్టకు భంగం వాటిల్లేలా చేస్తున్నారని వాపోయింది. అందులో ఎలాంటి నిజం లేదని.. అనవసరంగా ఇద్దరి ఇమేజ్ పాడు చేస్తున్నారని చెప్పుకొచ్చింది ఫాతిమా.