అధికారి ఆలోచన విధానానికి పాలకుడు ఆలోచించే తీరుకు ఎంతో వత్యాసం !!

మంత్రి పేర్ని నాని పండుగలకు వెళ్లే ఇరు తెలుగు రాష్ట్రాలకు చెందిన ముప్పై వేలమంది ప్రయాణికులకు ఇబ్బంది కల్గించేవిధంగా తెలంగాణ ఆర్టీసీ వ్యవహార తీరును ముఖ్యమంత్రి కె సి ఆర్ సమర్ధించరనే అభిప్రాయం తనకు ఉందని, ఒక అధికారి ఆలోచించే విధానానికి పాలకుడు ఆలోచించే తీరుకు ఎంతో వత్యాసం ఉంటుందని రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య ( నాని) ఆశాభావం వ్యక్తం చేశారు..

గురువారం ఆయన స్థానిక ఆర్ అండ్ బి అతిధి గృహంలో మాట్లాడుతూ, తెలుగు రాష్ట్రాల మధ్య బస్సులు నడపడంపై రాష్ట్ర ప్రభుత్వాల మధ్య స్పష్టత రావడం లేదని ఎవరెన్ని కిలో మీటర్లు తిప్పాలి..

ఏయే రూట్లల్లో తిప్పాలనే అంశంపై దాదాపు మూడు నెలల నుంచి ఏపీ-టీఎస్ ఆర్టీసీ అధికారులు..రవాణ శాఖ ఉన్నతాధికారుల మధ్య చర్చలు జరుగుతూనే ఉన్నాయన్నారు..

పొరుగు రాష్ట్రమైన తెలంగాణతో అంతర్రాష్ట్ర ఒప్పందం కుదరకపోవడంతోనే ఆంధ్రప్రదేశ్ నుండి బస్సులు నడపలేని పరిస్థితులు ఉత్పన్నమైనట్లు తెలిపారు..

ఇప్పటికే తెలంగాణకు నడిపే బస్సులను 2.65 లక్షల కి.మీ.కు తగ్గించామని,మరో 55 వేల కి.మీ. తగ్గించేందుకు సిద్దంగా వున్నమని, తెలంగాణను 50 వేల కి.మీ. పెంచుకోవాలని సైతం కోరామన్నారు..

అన్ని వేల కిలోమీటర్లకు సర్వీసులు నడపలేమని తెలంగాణ అధికారులు తెలిపారని మంత్రి పేర్ని నాని చెప్పారు.. ఆంధ్రప్రదేశ్ లో బస్సులు కిలోమీటర్లు తగ్గిస్తే, ప్రైవేటు ట్రావెల్స్ లాభపడతాయని వారికి సూచించినట్లు చెప్పారు..

రెండు రాష్ట్రాల మధ్య బస్సులు తిరగక ప్రయాణికులకు ఇబ్బందులు పడుతున్నరని,,ఇదే ఆదనుగా పబ్లిక్, ప్రైవేటు బస్సుల్లో ఎక్కువగా ఛార్జీలు వసూలు చేస్తున్నారని , వీలయినంత తొందరగా ఆర్టీసీ బస్సుల రాకపోకలపై తెలంగాణా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని ముఖ్యమంత్రి కె సి ఆర్ కు విజ్ఞప్తి చేస్తున్నట్లు మంత్రి పేర్ని నాని తెలిపారు…

ఉప సంచాలకులు, కృష్ణాజిల్లా సమాచార , పౌర సంబంధాల శాఖ మచిలీపట్నం వారిచే జారీ చేయబడింది..