అధికార పార్టీ నాయకుల అహంభావానికి పేరకాలపాడు గ్రామమే నిదర్శనం : తంగిరాల సౌమ్య

ఎన్టీఆర్ జిల్లా నందిగామ : పెరకలపాడు గ్రామ సర్పంచ్ మన్నె సాత్విక తెలుగుదేశం పార్టీ వ్యక్తి కావడంతో వైసిపి పార్టీ నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారని మాజీ శాసనసభ్యులు తంగిరాల సౌమ్య పేర్కొన్నారు.
నందిగామ పట్టణం గురువారం నాడు ఉదయం మాజీ శాసనసభ్యురాలు తంగిరాల సౌమ్య పెరకాలపాడు గ్రామమంలో ఏ కారణం లేకుండా గ్రామములో మలుపులు, ప్రధాన కూడళ్ల వద్ద సర్పంచ్ ఏర్పాటు చేసిన స్పీడ్ బ్రేకర్లు తొలగింపును తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా తంగిరాల సౌమ్య మాట్లాడుతూకంచికచర్ల మండల పరిధిలోని పేరకాలపాడు సర్పంచ్ తెలుగుదేశం పార్టీ వ్యక్తి కావడం అధికార పార్టీ నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారన్నారు.వయస్సులో చిన్న అయిన గ్రామ ప్రజలకోసం అనునిత్యం ప్రజాక్షేత్రంలో ఉండే సాత్వికను చూసి గ్రామములోని వైసీపీ నాయకులు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారన్నారు.కంచికచర్ల నుండి వీరులపాడు మండలం కు మరియు మధిర, ఎర్రుపాలెం ప్రాంతాలకు వెళ్ళు ప్రయాణికు లు కంచికచర్ల బైపాస్ పూర్తి అయిన నాటి నుండి వాహనదారులు పేరకలపాడు గ్రామం మీదుగా వెళ్తున్నారు అది అందరికి తెలిసిన విషయమే అన్నారు.

భారీ వాహనాలు, కార్లు, ద్విచక్ర వాహనాలు వేగంగా వెళ్తున్న నేపథ్యంలో, గ్రామస్తులు మాకు గ్రామంలో స్పీడ్ బ్రేకర్లు వేయించమని వాహనముల వేగాన్ని నియంత్రించ వలసిందిగా గ్రామస్థులు సర్పంచ్ ను కోరడంతో
గ్రామంలో మలుపుల వద్ద, ముఖ్య కూడలి వద్ద స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేస్తే వైసిపి నాయకులు, అధికారులు యుద్ధప్రతిపాదికన స్పీడ్ బ్రేకర్లు జేసీబీ పెట్టి తొలగించవలసిన అవసరం ఏమి వచ్చిందని ప్రశ్నించారు. గ్రామ పంచాయతీ కార్యదర్శి ఐ.నానిబాబు వైసీపీ పార్టీ కండువా కప్పుకొని పోలీస్ ల సహకారంతో బుధవారం నాడు సాయంత్రం స్పీడ్ బ్రేకర్లు తొలగించవలసిన అవసరం ఎం వచ్చిందన్నారు.నానిబాబు ప్రభుత్వ అధికారి అయ్యి ఉండి గ్రామస్థులు మరియు సర్పంచ్ అడిగిన వాటికి సమాధానం కూడా చెప్పకుండా ఎందుకు స్పీడ్ బ్రేకర్లు తొలగించారో సమాధానం చెప్పాలన్నారు. గ్రామ పంచాయతీ కార్యదర్శి నానిబాబు కి పై నుంచి ఏమైనా ఆదేశాలు ఉన్నాయా స్పీడ్ బ్రేకర్లు తొలగించమని? సమాధానం చెప్పాలి లేదంటే స్పీడ్ బ్రేకర్లను వాటి స్థానంలో వాటిని యధావిధిగా కొనసాగించాలన్నారు.

పార్టీలకు అతీతంగా గ్రామములో మెడికల్ క్యాంపులు,సేవ కార్యక్రమాలు చేపడుతున్న సర్పంచ్ ను అభినంది చవలసినది పోయి ఇటువంటి నీచ రాజకీయాలు చేస్తున్న వైసీపీ పార్టీ వారిని ప్రజలు గమనిస్తూనే ఉన్నారని, అధికారం ఈ రోజు ఉండొచ్చు రేపు పోవచ్చు అధికారం ఎవరి శాశ్వితం కాదని, పంచాయతీ కార్యదర్శి నానిబాబు ఈ రోజు అధికారపార్టీ తొత్తులా, కార్యకర్తగా పని చేస్తున్నారు భవిష్యత్తులో తప్పకుండా మూల్యం చెల్లించుకుంటారని హెచ్చరించారు.పెరకాలపాడు గ్రామమంలో ఏ కారణం లేకుండా గ్రామములో మలుపులు, ప్రధాన కూడళ్ల వద్ద ఏర్పాటు చేసిన స్పీడ్ బ్రేకర్లు తొలగింపుపై మండల ప్రజా పరిషత్ అధికారి వెంటనే స్పందించిదీనిపై పూర్తి విచారణ జరిపించి బాద్యులైన వారిపై తగిన కఠిన చర్యలు తీసుకోవాలని మాజీ శాసనసభ్యులు తంగిరాల సౌమ్య డిమాండ్ చేశారు.