వైరల్ గా మారినా గంగూలీ డ్యాన్స్ చేస్తున్న వీడియో

క్రికెట్ ప్రపంచంలో టీమిండియాను అగ్రభాగాన నిలిపిన వారిలో సౌరబ్ గంగూలీ ఒకరు.టీమిండియా గొప్ప కెప్టెన్లు ఎవరంటే అప్పుడు, ఇప్పుడు క్రికెట్ అభిమానుల నుండి గంగూలీ పేరు తప్పనిసరిగా వినిపిస్తుంది.  గంగూలీ కెప్టెన్‌గా టీమిండియాకు బలమైన లైనప్ ను నిర్మించగలిగారు. .గంగూలీ టీమిండియా తరపున 113 టెస్టులు, 311 వన్డేలు ఆడాడు. అన్ని ఫార్మాట్లలో కలిపి 18,575 పరుగులు చేశాడు. అతను అన్ని ఫార్మాట్లలో 195 మ్యాచ్‌లలో టీమిండియాకు నాయకత్వం వహించాడు …. ప్రస్తుతం గంగూలీ భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ (బీసీసీఐ) ప్రెసిడెంట్ గానూ కొనసాగుతున్నాడు. గంగూలీ కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి డ్యాన్స్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సౌరవ్ గంగూలీ శుక్రవారం తన 50వ పుట్టినరోజును జరుపుకున్నారు. లండన్ వీధుల్లో భార్య డోనా, కుమార్తె సనా, తన స్నేహితులతో కలిసి గంగూలీ డ్యాన్స్ చేస్తూ కనిపించారు. బాలీవుడ్ సంగీతానికి స్టెప్పులు వేశారు భార్య, కూతురు, స్నేహితులో కలిసి గంగూలీ డ్యాన్స్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీంతో నెటిజన్లు ‘ దాదా హ్యాపీ బర్త్ డే’ అంటూ శుభాకాంక్షలు చెబుతున్నారు.