యువతి పై దాడి చేసిన వ్యక్తిని అరెస్టు

నెల్లూరు లో మహిళను కొడుతూ వైరల్ అయిన వీడియో పోలీసుల ప్రాథమిక విచారణ లో ఆ సంఘటన సుమారు 2 నెలల క్రితం కొత్తూరు అటవీ ప్రాంతంలో జరిగిందని తెలిసింది. ఈ రోజు వెలుగులోకి రావడంతో పోలీసులు పల్లాల వెంకటేశ్ s/o మల్లికార్జున, 24 సంవత్సరాల వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. నెల్లూరు నగరంలోని రామకోటయ్య నగర్‌కు చెందిన అతను టిప్పర్ డ్రైవర్ గా పని చేస్తున్నాడు. ఈ వీడియోను వెంకటేష్ స్నేహితులు కొమరిక మనోహర్ (19), కొఠారి శివ (18) తీసినట్లుగా పోలీసుల విచారణలో తేలింది. శివను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.ఇక బాధితురాలు నెల్లూరులోని చైతన్యపురి నగర్‌లోని వెంకయ్య స్వామి ఎలైట్ అపార్ట్‌మెంట్‌లో భర్తతో కలిసి నివసిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. గతం లో ఆమెకు వెంకటేష్ తో అక్రమ సంబంధం ఉన్నట్టు ఆ సందర్భంలో ఆమెకు వేరొక వ్యక్తితో అక్రమ సంబంధం ఉందనే అనుమానంతో దాడి చేసినట్లు సమాచారం.