ఐదో విడత పల్లె ప్రగతి పనులను పరిశీలించిన జడ్పీటీసీ

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఐదో విడత పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా శుక్రవారం బూర్గంపహాడ్ మండలం లక్ష్మీపురం గ్రామ పంచాయతిలో పర్యటించిన బూర్గంపహాడ్ జడ్పీటీసీ కామిరెడ్డి శ్రీలత అనంతరం గ్రామంలో ప్రతి వీధిన తిరుగుతూ డ్రైనేజీలలోని పేరుకుపోయిన పూడిక తియ్యలని,నీరు నిల్వ ఉండకుండా కచ్ఛ డ్రైన్ తియ్యలని కార్యదర్శి కి సూచించారు.వర్షాకాల నేపథ్యంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ప్రతి ఒక్కరూ తగు జాగ్రత్తలు పాటించాలని పలు సూచనలు చేశారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ వివేక్ రాం,స్థానిక సర్పంచ్ సోంపాక నాగమణి,స్థానిక వార్డు సభ్యులు పాలం దివాకర్ రెడ్డి,బాదం పుణ్యవతి,కత్తి వెంకటరమణ,స్థానిక గ్రామ పంచాయతీ సెక్రటరీ కిరణ్ కుమార్,పంచాయితీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.