విఆర్ఏలు 12 రోజులుగా చేస్తున్న రిలే నిరాహార దీక్షలకు మద్దతు తెలిపిన సీపిఐ

బూర్గంపహాడ్ మండలకేంద్రంలో VRA లు గత 12 రోజులుగా చేస్తున్న రిలే నిరాహార దీక్షలకు సిపిఐ మండలసమితి సంగిీభావం తెలిపింది. ఈసందర్బంగా సిపిఐ మండ కార్యదర్శి మువ్వ వెంకటేశ్వర్లు.(లడ్డా)మాట్లాడుతూ. అసెంబ్లీ సాక్షి గా VRA లకు పే స్కెల్ జీవో ఇస్తానని ముఖ్యమంత్రి కెసిఆర్ మోసం చేసాడని అన్నారు. మోసాలు ఎప్పుడు నడవవని కొన్నిరోజులు మాత్రమే నడుస్తాయని అన్నారు. ప్రజలు ప్రపంచ నిర్మాతలని,సమయాన్ని బట్టి బుద్ది చెప్పుతారని అన్నారు. అతి కోర్కెలు మీము కోరటం లేదని, అధికారపార్టీ ఎన్నికల మేనిపెస్టోను మాత్రమే అమలు చేయమని కోరుతున్నామని అన్నారు. VRA సమస్య లతో పాటు మండలం లో ప్రధాన సమస్యలను గుర్తిస్తున్నామని,త్వరలో కార్యాక్రమాల షెడ్యూల్ ప్రకటిస్తా మని అన్నారు. ఈ సంగిీభావ కార్యక్రమంలో సిపిఐ జిల్లా సమితి సభ్యులు పేరాల శ్రీను,మండల సహాయ కార్యదర్శి పాండవులబిక్షం,బూర్గంపహాడ్ పట్టణకార్యదర్శి ముదిగొండ బాలకృష్ణ,దాసరి మల్సుర్ తదితరులు పాల్గొన్నారు.